రాజోలి వద్ద వెయ్యి క్యూసెక్కుల ప్రవాహం
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:26 AM
మండలంలోని రాజోలి ఆనకట్టకు కృష్ణాజలాలు చేరడంతో శనివారం నీరు పొంగి ప్రవహించింది. ‘కుందూ నువ్వెక్కడ’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ఈనెల 4న కథనం ప్రచురిరతమైంది. ఇందుకు స్పందించిన పాలకులు, అధికారులు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి కుందూకు నీరు విడుదల చేయడంతో ఆనకట్టకు చేరింది. దాదాపు వెయ్యి క్యూసెక్కుల నీరు చేరినట్లు కేసీకెనాల్ ఏఈ జమాల్‌వలి తెలిపారు
రాజోలి ఆనకట్ట వద్ద పొంగి ప్రవహిస్తున్న నీరు
చాగలమర్రి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రాజోలి ఆనకట్టకు కృష్ణాజలాలు చేరడంతో శనివారం నీరు పొంగి ప్రవహించింది. ‘కుందూ నువ్వెక్కడ’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ఈనెల 4న కథనం ప్రచురిరతమైంది. ఇందుకు స్పందించిన పాలకులు, అధికారులు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి కుందూకు నీరు విడుదల చేయడంతో ఆనకట్టకు చేరింది. దాదాపు వెయ్యి క్యూసెక్కుల నీరు చేరినట్లు కేసీకెనాల్ ఏఈ జమాల్‌వలి తెలిపారు. ఈ నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని రైతులు వరి సాగు చేయవద్దని సూచించారు.
సాగునీటి అవసరాలకే కేసీ నీరు
కేసీ ప్రధాన కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. డీఈ పుల్లయ్య, ఏఈ జమాల్‌వలి కేసీ కాలువలో నీటి ప్రవాహాన్ని శనివారం పరిశీలించారు. సంతజూటూరు నుంచి కుందూనదికి నీరు వదిలారని, తాగునీటి అవసరాలకేనని వెల్లడించారు. రైతులు వరి సాగు చేయరాదని, ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని సూపర్‌వైజర్ దస్తగిరి, లస్కర్లు ఉన్నారు.