పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణతకు కృషి
ABN , Publish Date - Nov 24 , 2026 | 12:18 AM
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, జడ్పీ ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ శ్యాముల్ అన్నారు.
ఆర్‌జేడీ శ్యాముల్
మంత్రాలయం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, జడ్పీ ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ శ్యాముల్ అన్నారు. సోమవారం మంత్రాలయం మండలంలోని తుంగభద్ర జడ్పీ ఉన్నత పాఠశాలను డీఈవో సుధకర్, ఎంఈవోలు రాగన్న, నాగభూషణంల ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. పాఠశాల గదులు, విద్యాభోధన, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం, మౌళిక సదుపాయాలను పరిశీలించారు. పదో తరగతిలో ప్రతి ఉపాధ్యాయుడు భోదించే భోధన విద్యార్థుల్లో మార్పు వచ్చే విధంగా చూడాలన్నారు. తరగతిలో వెనకబడిన బాల, బాలికలను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉత్తీర్ణతకు కృషి చేయాలని సూచించారు. అదనపు గదులు, వంట గదులు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. క్రీడల్లో విజయం సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈకార్యక్రమంలో హెచ్‌ఎం నారాయణ, రవికుమార్, కన్నడరాజు, సీఆర్‌పీ నర్సన్నగౌడు, బంగారప్ప, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.