మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యం
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:21 PM
మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర న్యాయ, మైనార్టీల శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
రాష్ట్ర మైనార్టీ, న్యాయ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
హుసేనాపురంలో షాదీఖానాను ప్రారంభించిన మంత్రి
ఓర్వకల్లు, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర న్యాయ, మైనార్టీల శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. ఆదివారం మండలంలోని హుసేనాపురంలో మల్లెల రాజశేఖర్ ఆధ్వర్యంలో రూ.1.50 కోట్లతో నిర్మించిన నారావారి షాదీఖానాను మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు మల్లెల రాజశేఖర్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ మండలంలోని నన్నూరు, ఓర్వకల్లు గ్రామాల్లో షాదీఖానాల నిర్మాణానికి అవసరమైన ప్రతి పాదనలను పంపించాలన్నారు. హుశేనాపురంలో షాదీఖానా నిర్మాణానికి మల్లెల రాజశేఖర్ కుటుంబం 20 సెంట్ల స్థలాన్ని ఇవ్వడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నాటి ముస్లిం కల నెరవేరిందన్నారు. మైనార్టీల సంక్షేమా నికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటు ఇమాములు, మౌజన్లు, ఫాస్టుర్లు, అర్చకులకు అందిస్తున్న సాయాన్ని ఆమె వివరించారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నాయకులు ఐకమత్యంతో ఉంటూ అన్నీ స్థానాలను కైవసం చేసుకోవాలన్నారు. మల్లెల రాజశేఖర్ మాట్లాడుతూ వైసీపీ నాయకులు కుల రాజకీయాలు, వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వకుండా అభివృద్ధిని గమనించాలన్నారు. మంత్రి, ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్‌ను ట్రెజరర్ మహబూబ్‌బాషా భారీ గజమాలతో సత్కరించారు.రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్‌పర్సన్ పార్వతమ్మ, తహసీల్దార్ విద్యాసాగర్, ఎంపీడీవో నాగ అనుసూయ, ఏవో మధుమతి, డీఈ శ్రీదేవి, ఏఈ సురేంద్ర రెడ్డి, శ్రీనివాసులు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందరెడ్డి, మండల కన్వీనర్ నాగిరెడ్డి, మాజీ ఎంపీపీ లక్ష్మణరావు, ట్రెజరర్ మహబూబ్‌బాషా, ఆలయ చైర్మన్ కాటినేని నారాయణ, సింగిల్ విండో చైర్మన్లు సుధకార్ రెడ్డి, సుధాకర్‌రావు పాల్గొన్నారు.