Share News

ఎయిడ్స్‌ సురక్ష చైతన్య యాత్ర ప్రారంభం

ABN , Publish Date - Aug 29 , 2026 | 11:49 PM

హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎయిడ్స్‌ సురక్ష చైతన్య యాత్ర వాహనం దోహదం చేస్తుందని కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.కే.వెంకటేశ్వర్లు జిల్లా ఎయిడ్స్‌ నివారణ అధికారి డా.ఎల్‌.భాస్కర్‌ పేర్కొన్నారు.

ఎయిడ్స్‌ సురక్ష చైతన్య యాత్ర ప్రారంభం
వాహనాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న జిల్లా టీబీ ఆఫీసర్‌ డా.భాస్కర్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.వెంకటేశ్వర్లు

కర్నూలు హాస్పిటల్‌, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎయిడ్స్‌ సురక్ష చైతన్య యాత్ర వాహనం దోహదం చేస్తుందని కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.కే.వెంకటేశ్వర్లు జిల్లా ఎయిడ్స్‌ నివారణ అధికారి డా.ఎల్‌.భాస్కర్‌ పేర్కొన్నారు. శనివారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఏఆర్‌టీ సెంటర్‌ ఎదురుగా కొత్తగా ఏర్పాటుచేసిన ఎయిడ్స్‌ సురక్ష చైతన్య యాత్ర వాహనాన్ని వారు ప్రారంభించారు. జిల్లా టీబీ ఆఫీసర్‌, ఎయిడ్స్‌ నివారణ అధికారి డా.భాస్కర్‌ మాట్లాడుతూ ఎల్‌ఈడీ మొబైల్‌ వాహనం ద్వారా జిల్లాలోని వివిఈ ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ వ్యాధుల వ్యాప్తి నివారణ, ముందస్తు పరీక్షలు, చికి త్స, అపోహల నివారణపై అవగాహన కల్పించనున్నారు. క్లస్టర్‌ ప్రోగ్రాం మేనేజర్‌ ఆలిహైదర్‌ మాట్లాడుతూ లైంగికంగా సంక్రమించే వ్యాధులు హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించడం అత్యం త కీలకమన్నారు. కార్యక్రమంలో జనరల్‌ మెడిసిన్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా.సోమప్ప, టీబీ లెప్రసీ మెడికల్‌ ఆపీసర్‌ డా.మల్లికార్జున రెడ్డి, ఏఆర్‌టీ వైద్యాధికారి డా.అభిగేయల్‌, దేవీ శంకర్‌ గౌడు, సీపీవో రాజ్యలక్ష్మి, ఎన్‌జీవో సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2026 | 11:49 PM