నిరాడంబరతకు గుర్తు నీలం
ABN , Publish Date - May 19 , 2026 | 11:24 PM
నిరాడంబర జీవితానికీ, రాజకీయాలకూ నీలం సంజీవరెడ్డి ఆదర్శమని పలువురు వక్తలు పేర్కొన్నారు.
సంజీవరెడ్డి జయంతి వేడుకల్లో వక్తలు
నంద్యాల కల్చరల్, మే 19(ఆంధ్రజ్యోతి) : నిరాడంబర జీవితానికీ, రాజకీయాలకూ నీలం సంజీవరెడ్డి ఆదర్శమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మంగళవారం మాతృభాషా పరిరక్షణ సమితి, నందిరైతు సమాఖ్య, మిడ్‌టౌన్ రోటరీ క్లబ్‌ల ఆధ్వర్యంలో పట్టణంలోని భారతీ సీడ్స్ కార్యాలయంలో భారత మాజీ రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి డా.నీలం సంజీవరెడ్డి 114వ జయంతి వేడుకలను నిర్వహించారు. నంది రైతు సమాఖ్య గౌరవ సలహాదారులు డాక్టర్ రవీంద్రనాద్ అధ్యక్షతన సంజీవరెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన సేవలు, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. వక్తలు మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్రతో పాటు, వ్యవసాయ, విద్యుత్ రంగాలపట్ల నీలంసంజీవరెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబరచారన్నారు. సంజీవరెడ్డి చేసిన సేవలు నేటికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రజాతీయ ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర అఽధ్యక్షుడు గునిశెట్టి శ్రీనివాసులు, డా. కిషోర్‌కుమార్, డాక్టర్ నేట్ల మహేశ్వరరెడ్డి, మాతృభాషా పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి, రోటరీ కేశవమూర్తి, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శేషఫణి, సాహిత్యప్రియులు పాల్గొన్నారు.