ప్రాఽథమిక వైద్యంపై అవగాహన పెంచాలి
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:05 AM
గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఆర్‌ఎంపీ, పీఎంపీలు ఎంతో విలువైన సేవలందిస్తున్నారని, ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, నివారణ చర్యలపై దృష్టి పెట్టాలని నంద్యాల మూడో అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్న రాజా పేర్కొన్నారు.
న్యాయాధికారి అమ్మన్న రాజా
నంద్యాల కోర్టు ప్రాంగణంలో ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినం
నంద్యాల క్రైం, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఆర్‌ఎంపీ, పీఎంపీలు ఎంతో విలువైన సేవలందిస్తున్నారని, ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, నివారణ చర్యలపై దృష్టి పెట్టాలని నంద్యాల మూడో అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్న రాజా పేర్కొన్నారు. నంద్యాల కోర్టు ప్రాంగణంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా లీగల్‌సెల్ అథారిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఆరోగ్య విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ అథారిటీ జిల్లా అధ్యక్షుడు, మూడో అదనపు జిల్లా న్యాయా ధికారి అమ్మన్న రాజా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటరమణ, రెడ్‌క్రాస్ సొసైటీ చైర ్మన్ పర్ల దస్తగిరి, ఆర్‌ఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రొక్కం నాగేశ్వరరెడ్డి, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు హుసేన్ బాషా, లీగల్ సెల్ సూపరింటెండెంట్ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆర్‌ఎంపీలు ఎంతో విలువైన సేవలందిస్తున్నారని, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పరిమితి మేరకే ప్రాఽథమిక వైద్యం చేయాలని సూచించారు. డీఎంహెచ్‌వో రమణ మాట్లాడుతూ ఓవర్ డోస్‌లు, యాంటీబైయాటిక్‌లు ఎక్కువ మోతాదులో ఇవ్వకుండా పరిమితి మేరకు ప్రాఽథమిక వైద్యం చేయాలని అన్నారు. దస్తగిరి మాట్లాడుతూ రెడ్‌క్రాస్, జనవిజ్ఞాన వేదిక లాంటి స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తూ పేదలకు తమవంతు సేవలు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్‌ఎంపీ అసోసియేషన్ జిల్లా నాయకుడు నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ వైద్య సేవలపై ప్రతి నెలా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సురే్‌షబాబు, కోశాధికారి నాగ సురేంద్ర, పట్టణ కన్వీనర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.