Share News

పుట్టగుంటలో వైసీపీ రికార్డింగ్‌ డ్యాన్స్‌లు

ABN , Publish Date - Jan 04 , 2026 | 12:44 AM

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గుడివాడ డివిజన్‌ పరిధిలోని నందివాడ మండలం పుట్టగుంట గ్రామంలో వైసీపీ ఆధ్వర్యంలో రికార్డింగ్‌ డ్యాన్సులు నిర్వహించడం కలకలం రేపుతోంది. ఎటువంటి అనుమతులు లేకుండా యువతులతో నృత్యాలు చేయించడం, నిర్వాహకులు సైతం పోలీసు అధికారులను తప్పుదోవ పట్టించడం ఆలస్యంగా బయటపడింది.

పుట్టగుంటలో వైసీపీ రికార్డింగ్‌ డ్యాన్స్‌లు

అనుమతులు లేకుండా నిర్వహణ

వైసీపీ సర్పంచ్‌ తెన్నేటి ఆధ్వర్యంలోనే న్యూ ఇయర్‌ సంబరాలు

అధికారులను తప్పదోవ పట్టించిన నిర్వాహకులు

బైండోవర్‌ చేసిన పోలీసులు

ఆంధ్రజ్యోతి-గుడివాడ : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గుడివాడ డివిజన్‌ పరిధిలోని నందివాడ మండలం పుట్టగుంట గ్రామంలో వైసీపీ ఆధ్వర్యంలో రికార్డింగ్‌ డ్యాన్సులు నిర్వహించడం కలకలం రేపుతోంది. ఎటువంటి అనుమతులు లేకుండా యువతులతో నృత్యాలు చేయించడం, నిర్వాహకులు సైతం పోలీసు అధికారులను తప్పుదోవ పట్టించడం ఆలస్యంగా బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. పుట్టగుంట గ్రామంలోని ఐపీఎం చర్చి ఎదురుగా వైసీపీ సర్పంచ్‌ తెన్నేటి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఒకటో తేదీ గురువారం రాత్రి 8 గంటల తరువాత ఈ రికార్డింగ్‌ డ్యాన్సులు ప్రారంభించారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన స్టేజీపై డ్యాన్సర్లతో పాటు స్థానిక యువకులు కూడా నృత్యాలు చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనాస్థలానికి వెళ్లే సమయానికి చిన్నారులు నృత్యాలు చేయడం కనిపించింది. నిర్వాహకులను నిలదీయగా, పోలీసులను తప్పుదోవ పట్టించారు. అనుమతులు లేకుండా నృత్యాలు చేయడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా యువతులతో పాటు స్థానిక యువకులు నృత్యాలు చేసిన వీడియోలు బయటకు రావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. నందివాడ ఎస్‌ఐ కె.శ్రీనివాస్‌ శనివారం రికార్డింగ్‌ డ్యాన్స్‌ నిర్వాహకులపై బైండోవర్‌ కేసు నమోదు చేశారు. స్థానిక తహసీల్దార్‌కు బైండోవర్‌ చేశారు.

Updated Date - Jan 04 , 2026 | 12:44 AM