Share News

పత్తి మొలకలకు బిందెలతో నీరు

ABN , Publish Date - Jun 12 , 2026 | 12:34 AM

పత్తి మొలకలను బతికించుకోవడానికి ఓ రైతు కుటుంబం బిందెలతో నీరు తెచ్చి సాళ్ల వెంట పోశారు. పంట కోసం రైతు పడే శ్రమను తెలియజేస్తుంది. ప్యాలకుర్తి మజారా కొత్తూరుకి చెందిన దూదేకుల అల్లాబకాష్‌ అనే రైతు వారం రోజుల క్రితం తనకున్న రెండెకరాల్లో పత్తి నాటించాడు. పది రోజుల కిం దట వర్షం కురియడంతో మంచి అదునుగా భావించి విత్తనాలు పెట్టించాడు. అయితే విత్తనాలు పొలంలో నాటించిన అనంతరం వర్షం జాడ లేకపోయింది.

పత్తి మొలకలకు బిందెలతో నీరు
మొక్కలకు నీరు పోస్తున్న రైతులు

కోడుమూరు రూరల్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): పత్తి మొలకలను బతికించుకోవడానికి ఓ రైతు కుటుంబం బిందెలతో నీరు తెచ్చి సాళ్ల వెంట పోశారు. పంట కోసం రైతు పడే శ్రమను తెలియజేస్తుంది. ప్యాలకుర్తి మజారా కొత్తూరుకి చెందిన దూదేకుల అల్లాబకాష్‌ అనే రైతు వారం రోజుల క్రితం తనకున్న రెండెకరాల్లో పత్తి నాటించాడు. పది రోజుల కిం దట వర్షం కురియడంతో మంచి అదునుగా భావించి విత్తనాలు పెట్టించాడు. అయితే విత్తనాలు పొలంలో నాటించిన అనంతరం వర్షం జాడ లేకపోయింది. దీనికితోడు ఎండ, గాలులకు పొలంలో తేమ ఆవిరై భూమి పైపొర గట్టిపడింది. విత్తనాలు పెట్టిన ఐదో రోజు నుంచి మొలకలు కనిపిస్తాయి. పైపొర గట్టిపడడంతో మొలకలు కనిపించలేదు. దీంతో దిగాలు చెందిన రైతు అల్లాబకాష్‌ కుటుంబ సభ్యులతో కలిసి రెండ్రోజుల నుంచి బిందెలతో నీటిని తెచ్చి సాళ్ల వెంట పోస్తున్నారు. ఇలా చేయడంతో మట్టి పొరలు విచ్చుకుని మొలకలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని రైతు తెలిపాడు. సేద్యం, విత్తులకు పెట్టుబడి రూ.20వేలు అయ్యిందని, పెట్టుబడి మట్టిపాలు కాకూడదనే తమ ప్రయత్నమని వివరించారు.

Updated Date - Jun 12 , 2026 | 12:34 AM