Share News

బెల్టు జోరు

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:35 AM

జిల్లాలో బెల్టుషాపుల దందా కొనసాగుతోంది. గ్రామానికి నాలుగు చొప్పున బెల్టుషాపులు ఏర్పాటుచేసి మరీ మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. మద్యం సీసా కొన్నవారికి గ్లాసు, వాటర్‌ ప్యాకెట్లను ఉచితంగా ఇస్తూ బడ్డీకొట్ల యజమానులే ఈ విక్రయాలు జరుపుతున్నారు. బెల్టుషాపులను నియంత్రించాల్సిన ఎకై్ౖసజ్‌, పోలీస్‌ విభాగాల అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోని ఎకై్ౖసజ్‌ అధికారులు మిన్నకుండిపోతుండగా, విజయవాడ నుంచి వస్తున్న ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అడపదడపా చేస్తున్న దాడుల్లో పెద్దఎత్తున సరుకు పట్టుబడుతోంది.

బెల్టు జోరు
గుడివాడలోని ఓ బెల్టుషాపులో మద్యం విక్రయాలు

జిల్లాలో యథేచ్ఛగా మద్యం విక్రయాలు

ధరలు పెంచి మరీ బడ్డీకొట్లలో అమ్మకాలు

మద్యం దుకాణాలు, బార్ల నుంచి సీసాల తరలింపు

మామూళ్ల మత్తులో స్థానిక ఎక్సైజ్‌, పోలీసులు

విజయవాడ నుంచి వస్తున్న అధికారులు

ఇటీవల దాడుల్లో భారీగా బయటపడిన సరుకు

స్థానిక ఎక్సైజ్‌ అధికారులపై అనుమానాలు

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లాలో 135 మద్యం దుకాణాలు, 32 బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిద్వారానే జిల్లాలోని అన్ని ప్రాంతాలకు మద్యాన్ని తరలిస్తున్నారు. మద్యం క్వార్టర్‌ బాటిల్‌ ధర రూ.110 ఉంటే, మరో రూ.20 అదనంగా తీసుకుని బెల్టుషాపులకు మద్యం బాటిళ్లను పంపుతున్నారు. బెల్టుషాపులకు మద్యం విక్రయించే అంశంలో మచిలీపట్నంలోని మద్యం, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ యజమానుల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో కొందరు మద్యం వ్యాపారులు మీడియా సమావేశం పెట్టి మరీ అక్రమాలను బయటపెట్టుకున్నారు. మచిలీపట్నంతో పాటు నార్త్‌, సౌత మండలాల్లోని బెల్టుషాపులకు ఎవరెవరు ఎంతమేర మద్యం సీసాలను పంపుతున్నారనే అంశాన్ని లెక్కగట్టి మరీ వెల్లడించారు. దీంతో ఈనెల 23న విజయవాడ నుంచి వచ్చిన ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం మచిలీపట్నం నార్త్‌ మండలంలోని పలు గ్రామాల్లో దాడులు చేసి బెల్టుషాపుల నుంచి అధికసంఖ్యలో మద్యం సీసాలను, బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకుంది. స్థానిక ఎకై్ౖసజ్‌ అధికారులకు తెలియకుండా ఈ దాడి జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసే సమయానికి కేవలం 8 క్వార్టర్‌ బాటిళ్లు మాత్రమే దొరికాయని స్థానిక ఎకై్ౖసజ్‌ అధికారులు చెప్పడం విడ్డూరం. ఇటీవల జంక్షన్‌ ఏర్పాటు ఉపయోగకరం. అలాగే, పెనమలూరు దగ్గర ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు మచిలీపట్నంలోని ఓ మద్యం దుకాణానికి సంబంధించి సిండికేట్లుగా ఉన్న వ్యాపారుల మద్య విభేదాలు వచ్చాయి. బెల్టుషాపులకు సంచులకొద్దీ మద్యం బాటిళ్లను పంపుతున్న విషయాన్ని సీసీ కెమెరాల పుటేజీ సహా ఆధారాలు చూపి జిల్లా ఎకై్ౖసజ్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు ఆ వైపునకు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మచిలీపట్నంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో మద్యం దుకాణాల నుంచి బెల్టుషాపులకు విక్రయించే మద్యాన్ని పట్టుకోకుండా కొత్త ఎత్తుగడ అమలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఆగని కాపుసారా తయారీ

జిల్లాలోని పలు ప్రాంతాల్లో కాపుసారా తయారీ జోరుగా సాగుతోంది. పెడన నియోజకవర్గం గూడూరు మండలం ఆర్వీపల్లి, పోసినవారిపాలెం గ్రామాల్లో జోరుగా సారా కాస్తున్నారు. ఈ గ్రామాల్లో ఇటీవల కాలంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు చేశారు. కాగా, గత ఏడాది కాలంలో మద్యం అక్రమ విక్రయాలు, కాపుసారా తయారీకి సంబంధించి 735 కేసులు నమోదు చేసి, 749 మందిని అరెస్ట్‌ చేసినట్లు ఎకై్ౖసజ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. 464 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని, 12,170 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశామని, 18 వాహనాలను సీజ్‌ చేశామని పేర్కొంటున్నారు.

నెలవారీ మామూళ్లు

నిబంధనల ప్రకారం మద్యం దుకాణాల్లో చీప్‌ లిక్కర్‌ క్వార్టర్‌ మద్యం రూ.110 నుంచి రూ.160కు విక్రయించాలి. కానీ, రూ.20 అదనంగా పెంచి అమ్ముతున్నారు. బెల్టుషాపు నిర్వాహకులు రూ.110 ధర ఉన్న క్వార్టర్‌ బాటిల్‌ను రూ.160కు విక్రయిస్తున్నారు. ఆయా మద్యం దుకాణాలకు సంబంధించిన పరిధిని నిర్ణయించి బెల్టుషాపులకు మద్యం విక్రయిస్తుండటంతో పాటు ముందస్తు సమాచారంతో ఎక్సైజ్‌శాఖ అధికారులు బెల్టుషాపులవైపు కన్నెత్తి చూడట్లేదనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల మద్యం దుకాణాల వద్ద పర్మిట్‌ రూమ్‌లకు అనుమతి ఇచ్చారు. దీంతో ఎకై్ౖసజ్‌, పోలీస్‌ శాఖల పేరుతో ఒక్కో మద్యం దుకాణం నుంచి నెలకు కనీసం రూ.50 వేలకు తగ్గకుండా మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Updated Date - Feb 28 , 2026 | 12:35 AM