Share News

పుస్తకాల పండగొచ్చిందోచ్‌..!

ABN , Publish Date - Jan 03 , 2026 | 12:53 AM

నిత్యం క్రీడాకారులతో కనిపించే ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం పుస్తకప్రియులతో నిండిపోయింది. ఏటా నిర్వహించే పుస్తక మహోత్సవం శుక్రవారం ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది.

పుస్తకాల పండగొచ్చిందోచ్‌..!

ఇందిరాగాంధీ స్టేడియంలో పుస్తక మహోత్సవం ప్రారంభం

విజయవాడ, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : నిత్యం క్రీడాకారులతో కనిపించే ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం పుస్తకప్రియులతో నిండిపోయింది. ఏటా నిర్వహించే పుస్తక మహోత్సవం శుక్రవారం ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పమిడిఘట్టం నరసింహం, డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణంరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ ప్రతినిధులు మనోహరనాయుడు, కె.లక్ష్మయ్య, ఎమెస్కో విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు వక్తలు పుస్తక పఠనంలో ఉన్న అభిరుచులను అనుభవపూర్వకంగా వివరించారు.

Updated Date - Jan 03 , 2026 | 12:53 AM