Share News

ఆర్టీసీకి పండగే..!

ABN , Publish Date - Jan 20 , 2026 | 01:01 AM

ఈ సంక్రాంతి పండుగ ఆర్టీసీకి మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. సోమవారం నాటికి రూ.1.10 కోట్ల ఆదాయాన్ని సాధించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో 11 రోజులు స్పెషల్‌ బస్సులు నడిచిన సంగతి తెలిసిందే.

ఆర్టీసీకి పండగే..!
సోమవారం పీఎన్‌బీఎస్‌లో రద్దీ

స్పెషల్‌ బస్సుల ద్వారా రూ.1.10 కోట్ల ఆదాయం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఈ సంక్రాంతి పండుగ ఆర్టీసీకి మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. సోమవారం నాటికి రూ.1.10 కోట్ల ఆదాయాన్ని సాధించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో 11 రోజులు స్పెషల్‌ బస్సులు నడిచిన సంగతి తెలిసిందే. ఈనెల 8 నుంచి 19వ తేదీ వరకు నిరాటంకంగా ఈ బస్సులు నడిచాయి. సంక్రాంతి ముందు మొత్తం 315 స్పెషల్స్‌ నడపగా, రూ.74,15,424 ఆదాయం లభించింది. పండుగ తర్వాత ఈనెల 16 నుంచి 18 వరకు 144 స్పెషల్స్‌ నడపగా, రూ.36,15,456 ఆదాయం లభించింది. ఇక 19వ తేదీ ఆదాయాన్ని కూడా కలుపుకొంటే సంక్రాంతి స్పెషల్‌ ఆపరేషన్‌ ద్వారా రూ.1.30 కోట్ల మేర ఆదాయం సాధించే అవకాశం ఉంది.

Updated Date - Jan 20 , 2026 | 01:01 AM