దుర్గమ్మకు రూ.3 కోట్ల కానుకలు
ABN , Publish Date - Jan 04 , 2026 | 12:45 AM
ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను శనివారం లెక్కించారు.
ఇంద్రకీలాద్రి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను శనివారం లెక్కించారు. మహామండపం ఆరో అంతస్థులో ఈవో శీనానాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, పాలకమండలి సభ్యులు, దేవదాయ శాఖ అధికారులు, ఏఈవోలు, ఆలయ సిబ్బంది, ఎస్పీఎఫ్, వన్‌టౌన్ పోలీసు సిబ్బంది, అమ్మవారి సేవాదారులు ఈ లెక్కింపులో పాల్గొన్నారు. రూ.3కోట్ల 6లక్షల 65వేల 228 ఆదాయం లభించింది. అలాగే, 341 గ్రాముల బంగారం, 3 కిలోల 586 గ్రాముల వెండి, ఆన్‌లైన్ హుండీ ద్వారా 21 రోజులకు రూ.1,13,085 లభించాయి. 86 యూఎస్‌ఏ డాలర్లు, 1,060 ఇంగ్లండ్ పౌండ్లు, 322 కువైట్ దీనార్‌లు, 10 ఆస్ర్టేలియా డాలర్లు, 12 సింగపూర్ డాలర్లు, 340 కెనడా డాలర్లు, 100 హాంకాంగ్ డాలర్లు, 700 ఓమన్ బైసాలు, 5 1/2 ఒమన్ రియాల్స్, 1,000 జపాన్ యెన్‌లు, 40 శ్రీలంక రూపాయలు, 70 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (దిర్హామ్స్), 3,500 మయన్మార్ క్యాట్‌లు, 11 మలేషియా రింగిట్‌లు, 40 యూరప్ యూరోలు, 700 దక్షిణాఫ్రికా రాండ్‌లు, 12 ఖతార్ రియాల్స్ లభించాయి.