Share News

మరణంలోనూ నలుగురికి జీవితం

ABN , Publish Date - Oct 10 , 2026 | 05:04 AM

ప్రమాదంలో ఊపిరి ఆగినా.. నలుగురిలో ఆ యువకుడు జీవించే ఉన్నాడు. తాను చనిపోయినా నలుగురికి ఊపిరిపోశాడు సుధాకర్‌. కొవ్వూరు పట్టణానికి చెందిన అడపా సుధాకర్‌ (33) పెయింటింగ్‌ పనులు చేస్తూ జీవించేవాడు

మరణంలోనూ నలుగురికి జీవితం

  • బ్రెయిన్‌ డెడ్‌ యువకుడి అవయవదానం

  • అవయవాల తరలింపునకు గ్రీన్‌ చానల్‌ ఏర్పాటు

రాజమహేంద్రవరం, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రమాదంలో ఊపిరి ఆగినా.. నలుగురిలో ఆ యువకుడు జీవించే ఉన్నాడు. తాను చనిపోయినా నలుగురికి ఊపిరిపోశాడు సుధాకర్‌. కొవ్వూరు పట్టణానికి చెందిన అడపా సుధాకర్‌ (33) పెయింటింగ్‌ పనులు చేస్తూ జీవించేవాడు. గత నెల 30న ఆరికరేవుల గ్రామం వద్ద మోటారు సైకిల్‌ నుంచి కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ వెంటనే అతన్ని రాజమహేంద్రవరంలోని జీజీహెచ్‌కు, అక్కడి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి.. అనంతరం కిమ్స్‌ బొల్లినేనికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి బ్రెయిన్‌ డెడ్‌గా నిర్థారించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. కాగా.. కొద్ది రోజుల క్రితం సుధాకర్‌.. తన స్నేహితుడు నేత్రదానం చేసిన సందర్భంలో తాను కూడా అవయవదానం చేయాలని నిర్ణయించుకున్నాడు.

అదే విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పాడు. దీంతో అవయవదానానికి వారు అంగీకరించగానే ప్రక్రియ ప్రారంభమైంది. ఒకే రోజు నిమిషాల వ్యత్యాసంతో ఊపిరితిత్తులను హైదరాబాద్‌కు విమానంలో తరలించగా, కిడ్నీ, లివర్‌లను అంబులెన్స్‌లో విశాఖపట్నం, శ్రీకాకుళం పంపించారు. మరో కిడ్నీని కిమ్స్‌ బొల్లినేనిలోని ఓ రోగికి అమర్చారు. అవయవాల తరలింపునకు పోలీసులు గ్రీన్‌ చానల్‌ ఏర్పాటు చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 10 , 2026 | 05:04 AM