Share News

అమరావతిలో చెస్‌ అకాడమీకి సహకరించండి

ABN , Publish Date - Oct 10 , 2026 | 05:11 AM

అమరావతిలో చెస్‌ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున మద్దతు ఇవ్వాలని ప్రముఖ చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు విజ్ఞప్తి చేశారు.

అమరావతిలో చెస్‌ అకాడమీకి సహకరించండి

  • లోకేశ్‌కు కోనేరు హంపి విజ్ఞప్తి

అమరావతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో చెస్‌ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున మద్దతు ఇవ్వాలని ప్రముఖ చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉండవల్లి నివాసంలో ఆమె తన తండ్రి అశోక్‌తోపాటు లోకేశ్‌ను కలిశారు. హంపి విజ్ఞప్తి పట్ల మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన చెస్‌ ఒలింపియాడ్‌-2026 మహిళల విభాగంలో భారత జట్టు కాంస్య పతకం, వ్యక్తిగత విభాగంలో హంపి బోర్డు-1లో కాంస్య పతకం కైవసం చేసుకోవడం పట్ల లోకేశ్‌ అభినందనలు తెలిపారు.

ఉమెన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ నిహారికకు లోకేశ్‌ అభినందన

రాష్ట్రానికి చెందిన యువ చెస్‌ క్రీడాకారిణి చల్లా నిహారిక కుటుంబసభ్యులతో కలిసి మంత్రి లోకేశ్‌ను కలిశారు. ఇటీవల ఫిడే ఉమెన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ హోదాను దక్కించుకున్న ఆమెను మంత్రి అభినందించారు. తన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఉమెన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌ సాధించడమే తన లక్ష్యమని నిహారిక తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 10 , 2026 | 05:11 AM