కావలి డీడీఓపై వేటు
ABN , Publish Date - Oct 27 , 2026 | 05:33 AM
ఎన్నికల నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిన బదిలీలకు సంబంధించి ఆదేశాలను ఉల్లంఘించిన మరో డీడీఓపై వేటు పడింది. కావలి డీడీఓ కుసుమ శ్రీదేవిని సస్పెండ్ చేస్తూ ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
విధుల్లో చేరనందుకు కుసుమ శ్రీదేవిపై చర్యలు
ఇప్పటికే ఇద్దరు జెడ్పీ సీఈఓలు సస్పెన్షన్
ప్రభుత్వానికి మరో జెడ్పీ సీఈఓ సరెండర్
అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిన బదిలీలకు సంబంధించి ఆదేశాలను ఉల్లంఘించిన మరో డీడీఓపై వేటు పడింది. కావలి డీడీఓ కుసుమ శ్రీదేవిని సస్పెండ్ చేస్తూ ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీదేవిని స్థానిక ఎన్నికల సందర్భంగా ఆత్మకూరు డ్వామా ఏపీడీ నుంచి కావలి డీడీఓగా నియమించారు. అయితే ఆమె బాధ్యతలు స్వీకరించలేదు. పలు దఫాలుగా విధుల్లో చేరాలని హెచ్చరించినా ఖాతరు చేయలేదు.
దీంతో ప్రభుత్వం ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. నిజానికి ఆమెను ఆత్మకూరు డ్వామా ఏపీడీగా నియమించగా జాయినై సెలవుపెట్టారు. కాగా ఇంతకుముందు పోలవరం, నంద్యాల సీఈఓలుగా నియమించిన ఇద్దరు అధికారులు విధుల్లో చేరకపోవడంతో సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.