Share News

మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌గా జస్టిస్‌ సత్యనారాయణమూర్తి బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Oct 27 , 2026 | 05:03 AM

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌గా జస్టిస్‌ సత్యనారాయణమూర్తి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కర్నూలు బళ్లారి చౌరస్తాలో ఉన్న కమిషన్‌ రాష్ట్ర కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.

మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌గా జస్టిస్‌ సత్యనారాయణమూర్తి బాధ్యతల స్వీకరణ

కర్నూలు లీగల్‌, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌గా జస్టిస్‌ సత్యనారాయణమూర్తి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కర్నూలు బళ్లారి చౌరస్తాలో ఉన్న కమిషన్‌ రాష్ట్ర కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈయన గతంలో కర్నూలులో అదనపు జిల్లా న్యాయాధికారిగా పని చేసి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. అదేవిధంగా మానవ హక్కుల కమిషన్‌ జ్యుడీషియల్‌ సభ్యుడిగా ఎన్‌.శ్రీనివాసరావు, నాన్‌ జ్యుడీషియల్‌ సభ్యుడిగా జీవీ మనోహర్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్న ఈ పదవులు భర్తీ కావడంతో కేసుల పరిష్కారంలో వేగం పెరుగుతుందని న్యాయవాదులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’

అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Updated Date - Oct 27 , 2026 | 05:03 AM