Share News

స్థానిక పోరుకు జనసేన సన్నద్ధం

ABN , Publish Date - Oct 10 , 2026 | 05:30 AM

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 19 పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక అడ్‌హక్‌ కమిటీలను జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నియమించారు.

 స్థానిక పోరుకు జనసేన సన్నద్ధం

  • అడ్‌హక్‌.. నిర్వాహక్‌ దళ్‌ పేరుతో 19 లోక్‌సభ స్థానాల్లో కమిటీల నియామకం

  • వారం రోజుల కసరత్తు తర్వాత ప్రకటన

అమరావతి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 19 పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక అడ్‌హక్‌ కమిటీలను జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నియమించారు. పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయి సమాచార సేకరణ, ఎన్నికల సన్నద్ధతపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో వారం రోజులుగా పలువురు ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులతో పవన్‌ కల్యాణ్‌ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలోని 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో క్షేత్రస్థాయి సమాచారాన్ని సమగ్రంగా సేకరించేందుకు పార్లమెంటు స్థాయి నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయి వరకు స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీల్లో ఎవరిని నియమించాలన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. శుక్రవారం ఆయా కమిటీలను ప్రకటించారు. ప్రతి పార్లమెంటరీ అడ్‌హక్‌ కమిటీలో ముగ్గురు పార్లమెంటుస్థాయి నాయకులతో పాటు నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి ముగ్గురు చొప్పున నేతలను నియమించారు. వీరికి సహకరించేందుకు ‘నిర్వాహక్‌ దళ్‌’ను ఏర్పాటు చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 10 , 2026 | 05:30 AM