Share News

అన్ని లెక్కలూ తేలుస్తా

ABN , Publish Date - Sep 24 , 2026 | 05:29 AM

‘కూటమి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయిపోయింది. కాలచక్రం వేగంగా తిరుగుతోంది. మరో రెండున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వమే వస్తుంది. ఐదేళ్లూ మనమే ఉంటామని వైసీపీ నేతల్ని ఇబ్బంది పెట్టే పోలీసులను హెచ్చరించండి.

అన్ని లెక్కలూ తేలుస్తా

  • రెండున్నరేళ్లలో మనమే వస్తున్నాం.. విశాఖ వైసీపీ నేతలతో జగన్‌

అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ‘కూటమి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయిపోయింది. కాలచక్రం వేగంగా తిరుగుతోంది. మరో రెండున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వమే వస్తుంది. ఐదేళ్లూ మనమే ఉంటామని వైసీపీ నేతల్ని ఇబ్బంది పెట్టే పోలీసులను హెచ్చరించండి. మనల్ని ఇబ్బంది పెట్టే వారి పేర్లు డిజిటల్‌ డైరీలో రాయండి. అన్ని లెక్కలూ తేలుస్తా’ అని వైసీపీ నాయకులకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ సూచించారు. బుధవారం తాడేపల్లి ప్యాలెస్‌లో విశాఖ మహానగర పరిధిలోని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, నేతలు, విశాఖ సమన్వయకర్త కురసాల కన్నబాబు తదితరులతో సమావేశమయ్యారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యమంటే గౌరవం లేదని, ఎన్నికలను సజావుగా సాగనివ్వరని.. అయినా గట్టిగా పోరాడాలని, నాయకులు, అధినాయకత్వం తోడుగా ఉంటుందని సూచించారు.

ఉత్తరాంధ్రను తాను అభివృద్ధి చేశానని చెప్పారు. భోగాపురం ఎయిర్‌ పోర్టును కట్టానని, మూలపాడు పోర్టును నిర్మించానని, గూగుల్‌ డేటా సెంటర్‌ను అదానీ ద్వారా రప్పించానని చెప్పారు. విశాఖలో చంద్రబాబు తన బంధువులకు శనక్కాయలు, బెల్లాలకు భూములు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఇలా భూములు ఇచ్చేసిన పాపాలన్నింటికీ త్వరలోనే చంద్రబాబు, లోకేశ్‌ అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు.

Updated Date - Sep 24 , 2026 | 05:29 AM