Share News

జగన్‌ మాటలు రైతులపై మానసిక దాడే: కొలుసు, అచ్చెన్న

ABN , Publish Date - Jan 09 , 2026 | 04:32 AM

రాజధాని అమరావతి ఎక్కడ కడుతున్నామో కేంద్రానికి, రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్న అంతర్జాతీయ సంస్థలకు తెలీదా..! అని మంత్రి కొలుసు పార్థసారథి, జగన్‌ను ప్రశ్నించారు.

జగన్‌ మాటలు  రైతులపై మానసిక దాడే: కొలుసు, అచ్చెన్న

ఇంటర్నెట్ డెస్క్: రాజధాని అమరావతి ఎక్కడ కడుతున్నామో కేంద్రానికి, రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్న అంతర్జాతీయ సంస్థలకు తెలీదా..! అని మంత్రి కొలుసు పార్థసారథి, జగన్‌ను ప్రశ్నించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘అమరావతే రాజధాని అని నాడు అసెంబ్లీలో చెప్పిన జగన్‌.. ఇప్పుడు నదీ గర్భంలో కడుతున్నామనడం విడ్డూరం. రాయలసీమ లిఫ్ట్‌ ప్రాజెక్ట్‌పై జగన్‌ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు’ అని కొలుసు అన్నారు. రాజధాని అమరావతే అని ఒప్పుకున్న జగన్‌ ఇప్పుడు ద్వంద్వ వైఖరితో మాట్లాడుతున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ‘అమరావతి నదీ గర్భంలో కడుతున్నామా? అమరావతిపై కుట్రలు చేయడం జగన్‌కు అలవాటుగా మారింది. ఇలాంటి మాటలు రాజధాని రైతులపై మానసిక దాడి చేయడమే. ఆయనో మానసిక రోగి. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం అనే పదాలు వింటే అతనిలో మృగం బయటకు వస్తుంది. అమరావతిపై అభ్యంతరం లేదన్న సజ్జల, జగన్‌ నేడు మాటలు మార్చడం వారి కుటిల రాజకీయమే’ అని ధ్వజమెత్తారు.

Updated Date - Jan 09 , 2026 | 04:34 AM