రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ నటులకు గాయాలు
ABN , Publish Date - Nov 23 , 2026 | 06:14 AM
డ్రైవర్ నిద్రమత్తు కారణంగా కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో జబర్దస్త్ నటులు రైజింగ్ రాజు, దొరబాబు గాయపడ్డారు
పాలకోడేరు, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): డ్రైవర్ నిద్రమత్తు కారణంగా కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో జబర్దస్త్ నటులు రైజింగ్ రాజు, దొరబాబు గాయపడ్డారు. కాకినాడలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జనసేన తరపున ప్రచారం నిర్వహించి భీమవరం వైపు వస్తుండగా డ్రైవర్ నిద్రమత్తు కారణంగా వారు ప్రయాణిస్తున్న కారు పశ్చిమగోదావరి జిల్లా గొరగనమూడి గ్రామంలో రహదారి పక్కనే ఉన్న విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. స్థానికులు ప్రమాదాన్ని గమనించి 108కు సమాచారం అందించడంతో భీమవరంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాజు, దొరబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.