Share News

సర్వే నౌక ‘సంశోధక్‌’ చిహ్నం ఆవిష్కరణ

ABN , Publish Date - Jun 10 , 2026 | 05:26 AM

సముద్ర జలాల్లో అత్యుత్తమ పరిశోధనా సామర్థ్యాన్ని అందించే లక్ష్యంతో నిర్మించిన సర్వే నౌక ‘ఐఎన్‌ఎస్‌ సంశోధక్‌’ అధికారిక చిహ్నాన్ని భారత నౌకాదళం మంగళవారం ఆవిష్కరించింది.

సర్వే నౌక ‘సంశోధక్‌’ చిహ్నం ఆవిష్కరణ

న్యూఢిల్లీ, జూన్‌ 9: సముద్ర జలాల్లో అత్యుత్తమ పరిశోధనా సామర్థ్యాన్ని అందించే లక్ష్యంతో నిర్మించిన సర్వే నౌక ‘ఐఎన్‌ఎస్‌ సంశోధక్‌’ అధికారిక చిహ్నాన్ని భారత నౌకాదళం మంగళవారం ఆవిష్కరించింది. సంశోధక్‌ ప్రాముఖ్యతను, దాని చిహ్నాన్ని ఎక్స్‌లో పోస్టు చేసిన వీడియోలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. ‘గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌, ఇంజనీర్స్‌ (జీఆర్‌ఎస్ఈ) ద్వారా దేశీయంగా నిర్మించిన సర్వే వెసల్‌ లార్జ్‌ (ఎస్‌వీఎల్‌) శ్రేణి నౌకల్లో నాలుగోదైన సంశోధక్‌ చిహ్నాన్ని మేం సగర్వంగా ఆవిష్కరిస్తున్నాం..’ అని నేవీ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈ నౌక చేపట్టే సర్వేలు, సముద్రగర్భ పరిశోధనలను ఈ చిహ్నం సూచిస్తుందని పేర్కొంది.

Updated Date - Jun 10 , 2026 | 05:27 AM