Share News

ఉద్యాన పంటల వారీగా ప్రణాళికలు: అచ్చెన్న

ABN , Publish Date - Jan 06 , 2026 | 06:40 AM

రాష్ట్రంలో ఉద్యాన రైతులు పండించే పంటలకు ప్రణాళికలను పంటల వారీగా సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు

ఉద్యాన పంటల వారీగా ప్రణాళికలు: అచ్చెన్న

అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉద్యాన రైతులు పండించే పంటలకు ప్రణాళికలను పంటల వారీగా సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం విజయవాడ క్యాంప్‌ కార్యాలయంలో ఉద్యానశాఖపై డైరెక్టర్‌ శ్రీనివాసులు, ఇతర అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘కోకో సహా అన్ని పంటల ధరలపై ముందస్తు అంచనాలు సేకరించి, ప్రభుత్వానికి నివేదించాలి. సూక్ష్మసేద్య పరికరాలు కోరిన ప్రతి ఉద్యాన రైతుకు అందించాలి. సూక్ష్మసేద్యంలో కొత్త విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలి. మామిడిలో తెగుళ్ల నివారణపై తగిన సూచనలివ్వాలి. మిర్చిసాగు, నాణ్యత, దిగుబడి, ధరలపై రైతులు, వ్యాపారులతో చర్చలు జరిపాలి’ అని ఆదేశించారు.

Updated Date - Jan 06 , 2026 | 06:41 AM