Share News

రాజధానిలో న్యూ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ

ABN , Publish Date - Jan 29 , 2026 | 04:40 AM

రాజధాని అమరావతిలో ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటుకు ది న్యూ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ ముందుకొచ్చింది.

రాజధానిలో న్యూ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ

  • రూ.100 కోట్లతో ప్రాంతీయ కార్యాలయ నిర్మాణం

  • 200 మందికిపైగా ఉద్యోగావకాశాలు.. సీఆర్‌డీఏతో ఎంవోయూ

గుంటూరు, జనవరి 28(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటుకు ది న్యూ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ ముందుకొచ్చింది. ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి పరిధిలో రూ.100 కోట్ల వ్యవయంతో ఈ కార్యాలయాన్ని నిర్మించనుంది. ఈ మేరకు కంపెనీ చీఫ్‌ రీజినల్‌ మేనేజర్‌ వి.రాజా, సీఆర్‌డీఏ అధికారుల మధ్య బుధవారం ఒప్పందం కుదిరింది. అమరావతిలో టెక్నికల్‌, ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, అడ్మిని స్ర్టేషన్‌ వంటి విభాగాల్లో 200 నుంచి 225 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అలాగే ఆధునిక అవసరాలకు అనుగుణంగా కొత్త ఇన్సూరెన్స్‌ ఉత్పత్తుల అభివృద్ధికి ఏఐ స్పెషలిస్ట్‌ అధికారులను కూడా నియమించనున్నామని చెప్పారు. గ్రామీణ, పట్టణ, కార్పొరేట్‌ రంగాలతో పాటు సాధారణ ప్రజలకు అవసరమైన అన్ని రకాల నాన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సేవలను అమరావతి ప్రాంతీయ కార్యాలయం ద్వారా అందిస్తామని పేర్కొన్నారు.

Updated Date - Jan 29 , 2026 | 04:41 AM