Share News

మున్సిపల్‌ కార్పొరేషన్లలో సభ్యుల సంఖ్యపై నిబంధనల సవరణ

ABN , Publish Date - Aug 13 , 2026 | 08:19 AM

మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఎన్నికైన సభ్యుల సంఖ్య నిర్ధారణకు సంబంధించిన నిబంధనల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక సవరణ చేసింది. ఈ మేరకు మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మున్సిపల్‌ కార్పొరేషన్లలో సభ్యుల సంఖ్యపై నిబంధనల సవరణ

  • మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో కూడా

అమరావతి: మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఎన్నికైన సభ్యుల సంఖ్య నిర్ధారణకు సంబంధించిన నిబంధనల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక సవరణ చేసింది. ఈ మేరకు మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ మున్సిపల్‌ కార్పొరేషన్ల(ఎన్నికైన సభ్యుల సంఖ్య నిర్ణయం) నిబంధనలు-2005లోని రూల్‌ 3 కింద ఉన్న ప్రొవిజన్‌(2)ను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. జనాభా గణనకు సంబంధించిన ప్రస్తుత ప్రక్రియలను దృష్టిలో ఉంచుకుని నిబంధనలు సవరించాల్సిన అవసరముందని మున్సిపల్‌ కమిషనర్‌ అండ్‌ డైరక్టర్‌ ప్రభుత్వానికి ప్రతిపాదించారు.


ఈ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం ప్రొవిజన్‌(2)ను తొలగించేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలో తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికైన సభ్యుల సంఖ్య నిర్ధారణకు సంబంధించిన నిబంధనల్లో కూడా ప్రభుత్వం సవరణ చేసింది. ఏపీ మున్సిపాలిటీల(నగర పంచాయతీలు, మున్సిపల్‌ కౌన్సిళ్ల సభ్యుల సంఖ్య నిర్ణయం) నిబంధనలు-2004లోని రూల్‌ 4 కింద ఉన్న ప్రొవిజన్‌(3)ను తొలగించింది. సవరించిన నిబంధనలకు గెజిట్‌లో ప్రచురించనున్నారు.

Updated Date - Aug 13 , 2026 | 08:22 AM