Share News

భూసేకరణలో ఇతర రాష్ట్రాల విధానాలను పాటించాలి

ABN , Publish Date - Jan 30 , 2026 | 04:39 AM

అమరావతి చుట్టూ ఏర్పాటు చేస్తున్న ఓఆర్‌ఆర్‌ భూసేకరణలో ఇతర రాష్ట్రాలు పాటిస్తున్న విధానాలనే... ఏపీలోనూ అవలంబించాలని అఖిల భారత కిసాన్‌ సభ.....

భూసేకరణలో ఇతర రాష్ట్రాల విధానాలను పాటించాలి

  • ఏఐకేఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌

  • గుంటూరులో అఖిల భారత కిసాన్‌ సభలు ప్రారంభం

గుంటూరు(తూర్పు), జనవరి 29 (ఆంధ్రజ్యోతి): అమరావతి చుట్టూ ఏర్పాటు చేస్తున్న ఓఆర్‌ఆర్‌ భూసేకరణలో ఇతర రాష్ట్రాలు పాటిస్తున్న విధానాలనే... ఏపీలోనూ అవలంబించాలని అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌ సూచించారు. గుంటూరులో జరుగుతున్న ఏఐకేఎస్‌ జాతీయ కౌన్సిల్‌ ప్రారంభ సమావేశంలో వికసిత్‌ భారత్‌-2047 అనే అంశంపై ఆయన ముఖ్యఅతిథిగా హజరై ప్రసంగించారు. సాగు భూములలో భారీస్థాయిలో రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. పైగా నామమాత్రపు పరిహారం ఇస్తే రైతుల పరిస్ధితి ఏంటని ప్రశ్నించారు. కేంద్రం ప్రతిష్టాత్మంగా తీసుకువచ్చిన వికసిత్‌ భారత్‌తో ప్రధాని మోదీ తప్ప ఏ ఒక్క భారతీయుడు లబ్ధి పొందలేదని ఎద్దేవా చేశారు.

Updated Date - Jan 30 , 2026 | 04:39 AM