గాదె సాయికృష్ణ మిస్సింగ్.. కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో తల్లి పిటిషన్..
ABN , Publish Date - Jun 26 , 2026 | 09:37 PM
తన కుమారుడు గాదె సాయికృష్ణ అదృశ్యం కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోరుతూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అమరావతి, జూన్ 26: తన కుమారుడు గాదె సాయికృష్ణ అదృశ్యం కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోరుతూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే సాయికృష్ణను కోర్టు ముందు హాజరు పర్చాలని విజయలక్ష్మి కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలోనే కేసులో సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తును కోరుతూ శుక్రవారం ఆమె హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో పోలీస్ ఉన్నతాధికారుల పాత్ర ఉందని, వాస్తవాలను తొక్కిపెడుతున్నారని విజయలక్ష్మి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ యంత్రాంగంతో సంబంధం లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థకు సాయికృష్ణ అదృశ్యం కేసును అప్పుగించాలని ఆమె కోరారు.
కాగా, సాయికృష్ణ అదృశ్యం కేసులో నిందితుడిగా ఉన్న ఇన్‌స్పెక్టర్ నాగరాజును కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు రెండో అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. సాయికృష్ణను చంపేశాక మృతదేహాన్ని మాయం చేశారని, ఆ మృతదేహాన్ని ఏం చేశారన్న వివరాలను రాబట్టాల్సి ఉందని తెలిపారు. ఇందుకోసం 12 రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు.
ఇవి కూడా చదవండి
సీఎం చంద్రబాబు నాయకత్వంలో గంజాయిపై ఉక్కుపాదం: హోం మంత్రి అనిత