2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ‘రోల్’ అబ్జర్వర్ల నియామకం
ABN , Publish Date - Nov 12 , 2026 | 06:25 AM
రాష్ట్రంలో వచ్చే ఏడాది ఖాళీ కానున్న శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గాల కొత్త ఓటర్ల జాబితా ప్రక్రియను పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) రోల్ అబ్జర్వర్లను నియమించింది
న్యూఢిల్లీ, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వచ్చే ఏడాది ఖాళీ కానున్న శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గాల కొత్త ఓటర్ల జాబితా ప్రక్రియను పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) రోల్ అబ్జర్వర్లను నియమించింది. తూర్పు-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు నలుగురు అధికారులు నియమితులయ్యారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి ఎ.సూర్యకుమారికి కాకినాడ, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాలను కేటాయించారు. కార్మిక శాఖ కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల బాధ్యతలను పర్యవేక్షిస్తారు. పురాతత్వ, మ్యూజియాల శాఖ కమిషనర్ ముత్యాలరాజు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలను చూడనుండగా.. ఏపీఎస్ఈబీ సీఈవో ఎస్.షాన్‌మోహన్ గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల రోల్ అబ్జర్వర్‌గా వ్యవహరిస్తారు. ఈ మేరకు ఈసీ కార్యదర్శి సుమన్ కుమార్ దాస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.