Share News

పారదర్శకంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ

ABN , Publish Date - Oct 10 , 2026 | 04:37 AM

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ భాను ప్రకాశ్‌ రాష్ట్ర అధికారులను ఆదేశించారు.

పారదర్శకంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ

  • కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ కమిషనర్‌

అమరావతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ భాను ప్రకాశ్‌ రాష్ట్ర అధికారులను ఆదేశించారు. నిబంధనలకు అనుగుణంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. ఓటరు నమోదు ప్రక్రియపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. ఉమ్మడి కృష్ణా- గుంటూరు, తూర్పు గోదావరి- పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి సన్నాహక ఏర్పాట్లపై శుక్రవారం ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌, వర్చువల్‌గా పాల్గొనగా, అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఢిల్లీరావు ఉమ్మడి కృష్ణా- గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాను ప్రకాశ్‌ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి టీచర్‌ ఓటరుగా పేరు నమోదు చేసుకునేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. ఈ ఓటరు నమోదు విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 10 , 2026 | 04:37 AM