రాజమహేంద్రిలో జూపార్కు!
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:56 AM
రాజమహేంద్రవరం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర వరానికి ఓ జూర్కు రానుంది. నగరా నికి సమీపంలోని దివాన్ చెరువులో పండ్ల మార్కెట్.. గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ మధ్యలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న 700 ఎకరాల అటవీభూమిలో జూపార్కు ఏర్పాటు చేయను
దివాన్‌చెరువు ఫారెస్ట్‌లో ఏర్పాటు
పరిశీలనకు 7న ఢిల్లీ నుంచి ప్రత్యేక అధికార బృందం రాక
రాజమహేంద్రవరం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర వరానికి ఓ జూర్కు రానుంది. నగరా నికి సమీపంలోని దివాన్ చెరువులో పండ్ల మార్కెట్.. గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ మధ్యలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న 700 ఎకరాల అటవీభూమిలో జూపార్కు ఏర్పాటు చేయను న్నారు. ఇప్పటికే ఇక్కడ కొంతమేర చెట్లు, తుప్పలు తొలగించి శుభ్రం చేశారు. జూ పార్కు ఏర్పాటు కోసం ఈ ప్రాంతాన్ని, అను కూలతలను పరిశీలించడానికి ఈనెల 7న న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక అధికార బృందం రాను ంది. ఎంపీ దగ్గు బాటి పురందేశ్వరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, స్థానిక డీఎఫ్‌వో ప్రభాకర్ తదితర అధికారులతో ఈ బృందం ఇక్కడ పరి శీలన చేస్తారు. ఈప్రాంత ప్రజలకు కూడా జం తువులంటే మక్కువ ఎక్కువే. గతంలో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాల్టీగా ఉన్న రోజుల్లో మున్సిపాల్టీ ఆవరణలో జింకలు ఉండేవి. అనేకమంది వాటిని చూడడం కోసం వచ్చేశారు. కడియం మం డలం జేగూరుపాడులోని జీవికే విద్యుత్ కేంద్రం వద్ద కూడా జింకలు, ఇతర వన్య మృగాలు ఉండేవి. ఇండస్ర్టీ సరిగ్గా నడకవ పోడంతో అక్కడ వన్యప్రాణులను అక్కడక్కడా వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దివాన్‌చెరువు ఫారెస్ట్‌లో చిరుతపులి కూడా సంచరించిన సంగతి తెలిసిందే. పర్యాట కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో జూపార్కు రావడాన్ని అందరూ స్వాగతిస్తారు.