న్యూఇయర్ వేడుకల్లో విషాదం..
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:47 AM
అంతర్వేది, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సర వేడుకలకు థార్ జీప్‌లో వచ్చిన మగ్గురు ముగ్గురు యువకులు ఆనందంగా గడిపారు. అయితే జీప్ నీటిలోకి దూసు కెళ్లడంతో యువకుడు మృతిచెందా డు. ఈ విషాద సంఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్‌లో జరిగింది. వి
అంతర్వేది బీచ్‌కు థార్ జీప్‌లో సరదాగా వచ్చిన ముగ్గురు యువకులు
సాగరసంగమం వద్ద గోదావరిలోకి జీప్ దూసుకెళ్లి ఒకరి మృతి..
ప్రాణాలతో బయటపడ్డ మరొకరు
అంతర్వేది, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సర వేడుకలకు థార్ జీప్‌లో వచ్చిన మగ్గురు ముగ్గురు యువకులు ఆనందంగా గడిపారు. అయితే జీప్ నీటిలోకి దూసు కెళ్లడంతో యువకుడు మృతిచెందా డు. ఈ విషాద సంఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్‌లో జరిగింది. వివరాల ప్రకారం.. కాకినాడలోని ఇంద్రపాలెనికి చెందిన నిమ్మకాయల శ్రీధర్ (35), వాకలపూడికి చెందిన నందమూరి వెంకటసాయినాగగోపికిషన్, పెద్దాపురానికి చెందిన బొండాడ సూర్యకిరణ్ బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో అంతర్వేదికి చేరుకున్నారు. బీచ్‌లో ఉన్న ప్రైవేటు రెస్టారెంటులో రూము తీసుకున్నారు. ముగ్గురు కలిసి థార్ జీప్‌లో వెళ్తూ బీచ్‌లో చక్కర్లు కొట్టారు. సూర్యకిరణ్ రూముకు వెళ్తానని చెప్పడంతో తనను రూములో దిగబెట్టి గోపీకిషన్, శ్రీధర్ మళ్లీ బీచ్‌లో థార్ జీప్‌తో చక్కర్లు కొట్టారు. వీడియోలు తీసుకుంటూ మైమరిచిపోయారు. అయితే గోదావరి, సము ద్రం సంగమం అయిన అన్నాచెల్లెలు గట్టు వద్ద జీప్ నీళ్లలోకి దూసుకెళ్లింది. ఉప్పునీరు లోనికి రాకుండా డోర్లు లాక్ చేసి ఉండడంతో కారు దిగబడిన విషయం కూడా డ్రైవింగ్ చేస్తున్న శ్రీధర్‌కు తెలియలేదు. ప్రమాదంలో ఇరుక్కుపోయామని గోపీకిషన్ అప్రమత్తమై రెస్టారెంట్‌కు ఫోన్ చేసి కారు దిగబడిపోయింది ట్రాక్టర్‌ను తీసుకురమ్మని కోరాడు. అప్పటికే పూర్తిగా నీరు ప్రవేశించడం, డోర్లు రాకపోయేసరికి ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్న తరుణంలో గోపీకిషన్ వెనుకడోరును కాలుతో తన్ని బయటకు కేకలు వేశాడు. అప్పటికే స్నేహితుడు శ్రీధర్‌ను బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. అతడు ప్రాణాలు విడిచాడు. గోపీకిషన్ కాపాడమని కేకలు వేయడంతో అదే సమయంలో నూతన సంవత్సర వేడుకల్లో ఉన్న కొంతమంది యువకులు అతడిని కాపాడగలిగారు. యువకులు సమాచారం అందివ్వడంతో గురువారం ఉదయం సఖినేటిపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో కారును గుర్తించి జేసీబీ సాయంతో బయటకు తీశారు.
అన్నయ్యతో చెప్పి వచ్చి అంతలోనే..
శ్రీధర్ ఒక ఫార్మా కంపెనీలో వర్క్‌ఫ్రం హోం ఉద్యోగం చేస్తున్నాడు. అతడి తండ్రి ఇటీవల ఎండోమెంట్‌లో రిటైర్డ్ అయ్యారు. తల్లి సంవత్సరం క్రితం మరణించింది. అన్నయ్య శ్రీనివాస్‌తో చెప్పి అంతర్వేదికి శ్రీధర్ వచ్చాడు. శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శ్రీధర్ మృతదేహాన్ని రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఎస్‌ఐ దుర్గాశ్రీనివాస్ తెలిపారు. శ్రీధర్ మృతితో కుటుంబసభ్యులతో పాటు స్నేహితులు శోకసంద్రంలో మునిగారు.