వైసీపీ విధ్వంసం..
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:21 AM
వైసీపీ శ్రేణులు పెట్రేగిపోయారు.. టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు.. కర్రలు, రాడ్లు, రాళ్లు, బీరు బాటిళ్లతో ఇష్టంవచ్చినట్టు కొట్టారు.. ఒకరిని పొట్టనపెట్టుకున్నారు.. మరికొందర్ని ఆసుపత్రుల పాలయ్యాలే చేశారు. దానికి నిదర్శనం కాకినాడ జిల్లా అల్లిపూడి, ఏ కొత్తపల్లిలో జరిగిన సంఘటనలే...
వైసీపీ శ్రేణులు పెట్రేగిపోయారు.. టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు.. కర్రలు, రాడ్లు, రాళ్లు, బీరు బాటిళ్లతో ఇష్టంవచ్చినట్టు కొట్టారు.. ఒకరిని పొట్టనపెట్టుకున్నారు.. మరికొందర్ని ఆసుపత్రుల పాలయ్యాలే చేశారు. దానికి నిదర్శనం కాకినాడ జిల్లా అల్లిపూడి, ఏ కొత్తపల్లిలో జరిగిన సంఘటనలే...
కోటనందూరు, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): వైసీపీ శ్రేణులు విచక్షణా రహితంగా దాడి చేసి టీడీపీ కా ర్యకర్త ప్రాణం తీశారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అ ల్లిపూడి గ్రామంలో శుక్రవారం రాత్రి వైసీపీ శ్రేణులు చేసిన దాడిలో టీడీపీ కార్యకర్త లాలం బంగారయ్య మృతి చెందాడు. శనివారం బంగారయ్య అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామస్తులు, టీడీపీ, జనసేన నా యకుల ఆధ్వర్యంలో జరిగాయి. ముందుగా బం గారయ్య మృతదేహాన్ని కోటనందూరు నుంచి అ ల్లిపూడి వరకు జనసందోహం మధ్య ఊరేగింపు గా తీసుకెళ్లారు. తదనంతరం ఇంటి వద్ద ఉంచి టీడీపీ నేతలు చింతంనీడి అబ్బాయి, గాడి రాజుబాబు, అంకంరెడ్డి రమేష్, పోతల సూరిబాబు, ఇనుగంటి సత్యనారాయణ, పెంటకోట భాస్కరసత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్ నివాళుల ర్పించారు. శ్మశానవాటిక వద్ద అంత్యక్రియలు ని ర్వహించారు. బంగారయ్య మృతితో కుటుంబం విలపి స్తుంది. వృద్ధులైన తల్లిదండ్రులు తమకు దిక్కెవరం టూ రోదిస్తున్న తీరు అంద ర్ని కంటతడి పెట్టించింది.
12 మందిపై కేసు నమోదు
కోటనందూరు మండలం అల్లిపూడిలో టీడీపీ కార్యకర్త లాలం బంగారయ్య మరణానికి ప్రధాన కారకుడైన వైసీపీ మండలాధ్యక్షుడు చింతకాయల చినబాబుతో పాటు మరో 11మందిపై 302, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఎస్‌ఐ టి.రామకృష్ణ తెలిపారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పిక్‌ట్ ఏర్పాటు చేశామన్నారు. అల్లర్లు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
తునికి తరలిన టీడీపీ శ్రేణులు
తుని రూరల్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): కోటనందూరు మండలం అల్లిపూడిలో వైసీపీ శ్రేణుల దాడిలో మరణించిన టీడీపీ కార్యకర్త లాలం బం గారయ్య మృతదేహానికి తుని ఏరియా ఆసుపత్రి లో పోస్టుమార్టం నిర్వహించారు. మరో కార్యకర్త చింతకాయల శ్రీరామ్ పరిస్థితి విషమంగా ఉం డడంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించారు.శనివారం వేకువజాము నుంచే తుని ఏరి యా ఆసుపత్రికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. టీడీపీ జిల్లా ఉపాఽధ్యక్షుడు యినిగంటి సత్యనారాయణ, మార్కెట్ కమి టీ చైర్మన్ అంకంరెడ్డి రమేష్ మీడియాతో మాట్లాడారు. స్థానిక వైసీపీ నాయకులు ప్రశాంతంగా ఉన్న తుని నియోజవర్గాన్ని రక్తసిక్తంగా మార్చేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి విలేకరిని పొట్టన పెట్టుకున్నారని, ఇప్పుడు బంగారయ్యను చంపారన్నారు. అల్లిపూడిలో వైసీపీ చింతకాయల చినబాబు ప్రోద్బలంతోనే బంగారయ్య హత్య చేశా రని ప్రత్యక్ష సాక్షి అంకంరెడ్డి బుల్లిబాబు మీడియాకు వెల్లడించారు. తన పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకుని అల్లిపూడిలోనే కేక్ కటింగ్ ఏర్పా ట్లు చేసుకునే తరుణంలో వైసీపీ నాయకులు త మపై తెగబడేందుకు కుట్రపన్నారనే సమాచారం అందిందని.. కొద్ది సమయానికి మూకుమ్మడిగా కత్తులు, రాడ్లతో దాడులకు తెగబడ్డారన్నారు. ఓ మంచి కార్యకర్తను కోల్పోయామని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే దివ్య పరామర్శ
తీవ్ర గాయాలతో కాకినాడలో ఓ ప్రైవేట్ ఆసు పత్రిలో వైద్యం పొందుతున్న చింతకాయల శ్రీరా మ్‌ను తుని ఎమ్మెల్యే యనమల దివ్య నాయకులతో కలిసి పరామర్శించారు. అల్లిపూడిలో జరిగిన దుర్ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని అండగా ఉంటామంటా మని ధె ౖర్యం చెప్పారు. గ్రామాల్లో ఇలాంటి ఫ్యాక్షన్ తరహా హత్యలు జరగడం దురదృష్టకరమన్నారు. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆమె తెలిపారు.