ఏకొత్తపల్లిలో బీభత్సం
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:29 AM
తొండంగి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏ కొత్తపల్లిలో కనుమ రోజైన శుక్రవారం వైసీపీ శ్రేణులు బీభత్సం సృష్టించారు. వారు చేసిన దాడిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఏ.కొత్తపల్లి సంత మార్కెట్ సెంటర్ వద్ద శుక్ర వారం గుండాట విషయంపై రెండు వర్గాల మఽ ద్య ఘర్షణ జరిగింది. దాన్ని ఆపేందుకు టీడీపీ కార్యకర్తలు నేమాల రామకృష్ణ (గోపి), కొంజర్ల గోవిందు ప్రయత్నించారు. దాంతో అక్కడే ఉన్న
రాడ్లు, కర్రలు, బీరుబాటిళ్లతో వైసీపీ శ్రేణుల దాడి
ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు తీవ్రగాయాలు
ఆరుగురిపై కేసు నమోదు
తొండంగి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏ కొత్తపల్లిలో కనుమ రోజైన శుక్రవారం వైసీపీ శ్రేణులు బీభత్సం సృష్టించారు. వారు చేసిన దాడిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఏ.కొత్తపల్లి సంత మార్కెట్ సెంటర్ వద్ద శుక్ర వారం గుండాట విషయంపై రెండు వర్గాల మఽ ద్య ఘర్షణ జరిగింది. దాన్ని ఆపేందుకు టీడీపీ కార్యకర్తలు నేమాల రామకృష్ణ (గోపి), కొంజర్ల గోవిందు ప్రయత్నించారు. దాంతో అక్కడే ఉన్న వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై కర్రలు, రాడ్లు, రాళ్లు, బీరుబాటిళ్లతో దాడి చేశారు. గాయపడిన వారిని 108 వాహనంలో తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. రాళ్లు విసురుతూ, కర్రలతో కొడుతూ కులం పేరుతో దూషిస్తూ తమపై దాడి చేశారంటూ బాధితులు తొండంగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దాడి చేసిన శిరసపల్లి శ్రీను, శిరసపల్లి అయ్యప్ప, శిరసపల్లి మణికంఠ, పులిబంటి శ్రీను, మడుగుల సత్తిబాబు, కుక్కులూరి మల్లేశ్వరరావుపై కేసు నమోదు చేసినట్టు హెచ్‌సీ పాండురంగా తె లిపారు. ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీ సుకున్నట్టు ఆయన తెలిపారు. గాయపడ్డ బాధితులను తుని ఎమ్మెల్యే యనమల దివ్య, టీడీపీ సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతంనీడి అబ్బాయిలు పరామర్శించి ధైర్యం నింపారు.