Share News

యానాం.. ఉత్సవం!

ABN , Publish Date - Jan 07 , 2026 | 12:24 AM

యానాం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): యానాం లో ప్రజా ఉత్సవాలు, ఫలపుష్ప ప్రదర్శన మంగ ళవారం ఆట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పుదుచ్చేరి పర్యాటకశాఖ ఆధ్వర్యంలో స్థానిక పరిపాలనాధికారి అంకిత్‌కుమార్‌ ఆధ్వర్యంలో వ్యవసాయశాఖ డీడీ జోగిరాజు, మున్సిపల్‌ కమిషనర్‌ రఘవాన్‌ జ్యోతి ప్రజ్వలన చేసి

యానాం.. ఉత్సవం!
ప్రజలతో నిండిన బాలయోగి స్టేడియం

ప్రజా ఉత్సవాలు ప్రారంభం

అలరించిన సాంసృతిక కార్యక్రమాలు

యానాం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): యానాం లో ప్రజా ఉత్సవాలు, ఫలపుష్ప ప్రదర్శన మంగ ళవారం ఆట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పుదుచ్చేరి పర్యాటకశాఖ ఆధ్వర్యంలో స్థానిక పరిపాలనాధికారి అంకిత్‌కుమార్‌ ఆధ్వర్యంలో వ్యవసాయశాఖ డీడీ జోగిరాజు, మున్సిపల్‌ కమిషనర్‌ రఘవాన్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. వ్యవసాయశాఖ మంత్రి తేనే జైకుమా ర్‌ ఫలపుష్ప ప్రదర్శనను ప్రారంభించారు. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్‌ అశోక్‌ వేర్వేరుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నంకు చెందిన విక్టరీ ఈవెంట్స్‌ మేకర్స్‌ మేడిద విక్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సాం స్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ముందుగా శాస్ర్తీయ, నృత్య పోటీలను నిర్వహించారు. ఒడిస్సా కళాకారుల ప్రత్యేక నృత్య ప్రదర్శన, విశాఖపట్నంకు చెందిన ఎల్‌ఈడీ ట్రాన్‌ లైటింగ్‌ యాక్ట్‌, జబర్దస్త్‌ కళాకారులు వినోదిని, అప్పారావు, గెడ్డం నవీన్‌ స్కిట్లు, విశాఖపట్నంకు చెందిన డీజేటీల్లు ప్రదర్శనలు అదరహో అలరించాయి. వీటిని తిలకించేందుకు యానాం పరిసర ప్రాంతాల నుంచి ప్రజ లు తరలిరావడంతో జీఎంసీ బాలయోగి క్రీడామైదానం జనసంద్రంగా మారింది. అయితే మల్లాడి కృష్ణారావు, ఎమ్మెల్యే గొల్లపల్లి, పరిపాలనాధికారి అంకిత్‌కుమార్‌ల మధ్య సమన్వయ లోపంతో ఉత్సవాల్లో కొంత సందిగ్ధత ఏర్పడింది.

Updated Date - Jan 07 , 2026 | 12:24 AM