పూల ప్రేమికులు.. పోటెత్తారు!
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:43 AM
యానాం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): యానాం జీఎంసీ బాలయోగి క్రీడామైదానంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తునన ఫలపుష్ప ప్రద ర్శన శుక్రవారం భారీ సంఖ్యలో పూల ప్రేమికులు తరలివచ్చారు. గత 23 ఏళ్లుగా 3 రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనను ఈ ఏడాది 4 రోజుల పాటు జరగడం విశేషం. వివిధ రకాల జాతుల మొక్కలను ప్రదర్శనలో ఉంచారు. వివిధ రకాల ఆకృతులతో ఏర్పాటు చేసిన బొకేలు, పుష్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొక్క
యానాంలో ఫలపుష్ప ప్రదర్శనకు
భారీగా తరలివచ్చిన ప్రజలు
నేడు కూడా కొనసాగింపు!!
యానాం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): యానాం జీఎంసీ బాలయోగి క్రీడామైదానంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తునన ఫలపుష్ప ప్రద ర్శన శుక్రవారం భారీ సంఖ్యలో పూల ప్రేమికులు తరలివచ్చారు. గత 23 ఏళ్లుగా 3 రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనను ఈ ఏడాది 4 రోజుల పాటు జరగడం విశేషం. వివిధ రకాల జాతుల మొక్కలను ప్రదర్శనలో ఉంచారు. వివిధ రకాల ఆకృతులతో ఏర్పాటు చేసిన బొకేలు, పుష్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొక్కలు చోరీలకు గురికాకుండా యానాం పోలీసు సహకారంతో వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ చిక్కల జోగిరాజు, ఖాన్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఫలపుష్ఫ ప్రదర్శన మరో రోజు పొడిగిస్తున్నట్టు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. శనివారం నుంచి పాఠశాలలకు సెలవులు కావడంతో మరో రోజు పొడిగించాలని ప్రజల అభ్యర్థన మేరకు మల్లాడి కృష్ణారావు పుదుచ్చేరి సీఎం, మంత్రులతో ఫోన్లో మాట్లాడారు. దానికి వారు అంగీ కారం తెలపడంతో శనివారం రాత్రి 10గంటల వరకు ఫలపుష్ప ప్రదర్శన కొనసాగనుందని మల్లాడి తెలిపారు. అయితే ఇందుకు యానాం పరిపాలనాధికారి అంకిత్‌కుమార్ అంగీకారం తెలపలేదని తెలుస్తోంది.