మహిళా సంక్షేమంలో జిల్లా ప్రగతి పథం
ABN , Publish Date - Mar 09 , 2026 | 01:09 AM
కలెక్టరేట్ (కాకినాడ), మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మహిళా సంక్షేమంలో కాకినాడ జిల్లా ప్రగతి పథంలో ఉందనీ, ఈఏడాది స్వయం సహాయక సంఘాలకు రూ.1460 కోట్లు రు
జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్
డ్వాక్రా సంఘాలకు రూ.1460 కోట్లు రుణాలు
కాకినాడలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
కలెక్టరేట్ (కాకినాడ), మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మహిళా సంక్షేమంలో కాకినాడ జిల్లా ప్రగతి పథంలో ఉందనీ, ఈఏడాది స్వయం సహాయక సంఘాలకు రూ.1460 కోట్లు రుణాలు ఇచ్చా మని జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ తెలిపారు. ఆదివారం కాకినాడ కుళాయి చెరువు పార్కులోని కళాక్షేత్రం మీటింగ్ హాలులో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ, సెర్ఫ్, మెప్మాశాఖల ఆధ్వర్యంలో జి ల్లాస్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వ హించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ మాట్లాడుతూ ఉన్నతి పథకం ద్వారా 1960మందికి రూ.10.60కోట్లు జీవనోపాధి కల్పించా మన్నారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను అందిపుచ్చుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ కుటుంబాలను పోషిం చుకుంటూ వ్యాపార రంగాల్లో రాణిస్తున్న మహిళలు స్ఫూర్తిదాయకమన్నారు.
మహిళలకు సత్కారం
వేట్లపాలెం పేలుళ్ల ఘటనలో మృతదేహాలను తరలించడంలో విశేష కృషి చేసిన పెద్దాపురం ఎస్‌ఐ మౌనిక, సామర్లకోట ఎంపీడీవో హిమమహేశ్వరిని సత్కరించారు. జిల్లాలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన మహిళలను సత్కరించారు. జిల్లాలో 1.36 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.17.36 కోట్లు, పట్టణ మహిళా సంఘాలు 2827 మందికి రూ.434.62 కోట్లు రుణాల చెక్కులను అందజేశారు. 10వ తరగతి టాపర్స్‌కు రూ.8.25లక్షల చెక్కులు ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జేసీ అపూర్వ భరత్, అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, కమిషనర్ సత్యనారాయణ, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.