అదనపు కట్నం వేధింపులు.. అతలాకుతలమైన బతుకులు..
ABN , Publish Date - Jan 19 , 2026 | 01:12 AM
మండపేట, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): భర్త మద్యానికి బానిసయ్యాడు. భార్య, ఇద్దరు కూతు ళ్లను బాధ్యతను పక్కనపెట్టాడు. అదనపు కట్నం కోసం ఆమెను వేధించాడు. అతడికి తోడు అత్త మామల వేధింపులు తాళలేకపోయింది ఆ ఇల్లా ్లలు.. ఇద్దరు బిడ్డలను వదిలేసి ఉరివేసుకుని ఆత్మ హత్యకు పాల్పడింది. భార్య మరణంతో భర్త రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డాడు. ఈ విషాద సంఘటన తూర్పుగోదావరి జిల్లా మండపేటలో జరిగింది. మండ
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
భార్య మరణంతో రైలు కిందపడి భర్త ఆత్మహత్యాయత్నం
విలపిస్తున్న ఇద్దరు కూతుళ్లు
మండపేటలో ఘటన
మండపేట, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): భర్త మద్యానికి బానిసయ్యాడు. భార్య, ఇద్దరు కూతు ళ్లను బాధ్యతను పక్కనపెట్టాడు. అదనపు కట్నం కోసం ఆమెను వేధించాడు. అతడికి తోడు అత్త మామల వేధింపులు తాళలేకపోయింది ఆ ఇల్లా ్లలు.. ఇద్దరు బిడ్డలను వదిలేసి ఉరివేసుకుని ఆత్మ హత్యకు పాల్పడింది. భార్య మరణంతో భర్త రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డాడు. ఈ విషాద సంఘటన తూర్పుగోదావరి జిల్లా మండపేటలో జరిగింది. మండపేట ఎస్‌ఐ ఎస్‌ఐ రాము తెలిపిన వివరాల ప్రకారం.. మం డపేటలోని సైధిల్‌పేటకు చెందిన ఫణీంద్రకు, కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన కానురి సత్యభారతి (26)తో 7 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.5లక్షల కట్నం ఇచ్చారు. వారికి ఇద్దరు కూతుళ్లు సంతానం. అయితే ఫణీంద్ర తరచూ మద్యం తాగి భార్యను వేధిస్తుండేవాడు. ఇద్దరు ఆడపిల్లలే పుట్టారని కోపపడేవాడు. తన తమ్ము డికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారని అనేవాడు. దీంతో భారతి మానసిక క్షోభకు గురైంది. ఫణీం ద్ర మద్యానికి బానిస కావడంతో తరచూ దంప తుల మధ్య గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో ఆదివారం ఇంట్లో భారతి చీరతో ఉరి వేసుకుంది. భార్య మరణంతో ఫణీంద్ర ఆత్మహత్య చేసు కోవాలనుకున్నాడు. ద్వారపూడి రైల్వేస్టేషన్‌కు చేరుకుని అక్కడ రైలు కింద పడి ఆత్మహత్యకు ప్రయత్నించగా రైల్వే పోలీసులు కాపాడారు. గాయాలపాలైన అతడిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తర లించగా చికిత్స పొందుతున్నాడు. అయితే తన కూ మార్తె ఉరి వేసు కుని చనిపోయేంత పిరికిది కాదని, వేధింపులతో అత్తింటివారే హతమర్చారని మృతురాలి తల్లి వండ్లమాని మంగాదేవి మండపేట పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పట్టణ ఎస్‌ఐ రాము సంఘటనా స్థలాన్ని పరిశీలిం చారు. భారతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక పక్క తల్లి మరణం, మరోపక్క తండ్రి గాయాల తో ఆసుపత్రి పాలవ్వడంతో ఇద్దరు చిన్నారులు ఏడుస్తున్న తీరు స్థానికులను కలచివేస్తుంది.