గ్రామాల అభివృద్ధే ధ్యేయం
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:48 AM
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమనిఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. మండలంలో రూ.3.10 కోట్లతో కడియం-జేగురుపాడు సీసీ, బీటీ రోడ్డు, కడియపులంక-పొట్టిలంక సీసీ రోడ్డు రహదారుల నిర్మాణానికి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశా రు. పొట్టిలంక,కడియపుసావరం, దుళ్ల, కడియపులంక గ్రా మాల్లో పర్యటించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి
కడియంలో రూ. 3.10 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
కడియం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమనిఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. మండలంలో రూ.3.10 కోట్లతో కడియం-జేగురుపాడు సీసీ, బీటీ రోడ్డు, కడియపులంక-పొట్టిలంక సీసీ రోడ్డు రహదారుల నిర్మాణానికి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశా రు. పొట్టిలంక,కడియపుసావరం, దుళ్ల, కడియపులంక గ్రా మాల్లో పర్యటించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మడికి-మెర్నిపాడు రోడ్డు మరమ్మతు పనులను పరిశీలించారు. కడియపులంకలో చర్చి అభివృద్ధికి రూ.2 లక్షల అందజే శారు. త్వరలో కడియం-వెలగతోడు ప్రధాన రహదారి పనులు చేపడతామని పేర్కొన్నారు.కడి యపుసావరంలో సంక్రాంతి ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు అందించారు.కార్యక్రమం లో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, ఏపీఐ ఐసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, వెలుగుబంటి నాని, సర్పంచ్‌లు అన్నందేవుల చంటి, చెక్కపల్లి మురళి, నాయకులు చెల్లుబోయిన శ్రీను, పంతం గణపతి, కలిదిండి గోవిందు, కొత్తపల్లి శ్రీరామ్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
దళితుల ఎదుగుదలకు కృషి
ధవళేశ్వరం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): ధవళేశ్వరంలో టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జి తలారి మూర్తి ఆధ్వర్యంలో దళితుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఎమ్మెల్యే గోరంట్ల ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. దళితులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు కృషిచేస్తానని, నియోజకవర్గంలో దళితుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.