Share News

జిల్లావ్యాప్తంగా వాహనాల తనిఖీ

ABN , Publish Date - Jan 07 , 2026 | 01:24 AM

జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి నిరంతర తనిఖీలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ రాహుల్‌మీనా అన్నారు.

జిల్లావ్యాప్తంగా వాహనాల తనిఖీ

అమలాపురం, జనవరి 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి నిరంతర తనిఖీలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ రాహుల్‌మీనా అన్నారు. ముఖ్యంగా యువకులు మితిమీరిన వేగంతో వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వాహనదారులు తప్పనిసరిగా లైసెన్సు, హెల్మెట్‌, వాహన పత్రాలు కలిగి ఉండాలని, లేనిపక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలోని మంగళవారం వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో వాహన తనిఖీలు చేపట్టాలని ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా పరిధిలోని అన్నిస్టేషన్లలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఇందులోభాగంగా పోలీసులు మైనర్లకు డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా వాహనాలు నడుతుపున్న వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించి మద్యం మత్తులో వాహనాలునడుతున్న వారిపై కేసు లు నమోదుచేశారు. హెల్మెట్‌ లేకపోవడం, మితిమీరిన వేగంతో వాహనాలు నడిపేవారిపై చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా వాహనదారులకు అవగాహన కల్పించేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - Jan 07 , 2026 | 01:24 AM