Share News

టిక్కెట్‌.. హాంఫట్‌..

ABN , Publish Date - Jan 18 , 2026 | 12:30 AM

ఆత్రేయపురం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): కోనసీమ తిరుపతిగా ఖ్యాతినర్జీస్తూ భక్తజనంతో విరాజిల్లుతున్న వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతుంది. కొందరు టికెట్‌ కౌంటర్లలో మాయజాలం చేసి రూ.లక్షలు పక్కదారి పట్టించి తమ ఖాతాల్లో జమ చే

టిక్కెట్‌.. హాంఫట్‌..
ఆలయంలో టిక్కెట్ల కౌంటర్ల క్యూలైన్‌

వాడపల్లి వెంకన్న ఆలయంలో టిక్కెట్ల మాయజాలం

ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది చేతివాటం

వారిపై చర్యలు నామమాత్రం

ఆత్రేయపురం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): కోనసీమ తిరుపతిగా ఖ్యాతినర్జీస్తూ భక్తజనంతో విరాజిల్లుతున్న వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతుంది. కొందరు టికెట్‌ కౌంటర్లలో మాయజాలం చేసి రూ.లక్షలు పక్కదారి పట్టించి తమ ఖాతాల్లో జమ చేసుకుంటున్నారు. మరికొంతమంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యహరించడంతో పాటు నగదు అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికి వారిని మందలించి తిరిగి వారి కే బాధ్యతలు అప్పగిస్తున్న వ్యవహారం సర్వత్రా ఆరోపణలకు దారితీస్తుంది. రాజకీయ నేతల సిఫార్సుతో విధులు నిర్వహిస్తున్న కొంతమంది సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి టి క్కెట్‌ కౌంటర్లలో మాయజాలం చేసి డబ్బులు తమ ఖాతాల్లోకి జమచేసుకుంటున్నారు. ఇటీవల ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించి దేవస్థానం ఆదాయానికి గండికొట్టిన వ్యవహారం వె లుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. టిక్కెట్‌ కౌంటర్లలో కొంతమంది సిబ్బంది చేస్తున్న బా గోతం బయటపడింది. కేవలం ఒక వ్యక్తినే అభి యోగం మోపారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మిగిలిన వారిని విచారణ లేకుండా తప్పి ంచారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యం గా రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ దేవాలయాల్లో ప్రముఖలకు మెరుగైన సేవలను అందించేం దుకు ఆన్‌లైన్‌ విఽధానం ప్రవేశపెట్టింది. దేవస్థానంలో యాప్‌, వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కె ట్లు కొనుగోలు చేసే సౌకర్యం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాడపల్లి వెంకన్న ఆలయంలో ఆన్‌లైన్‌ కౌంటర్లను ఏర్పాటు చేసి భక్తులకు సేవల టిక్కెట్లను అందిస్తున్నారు. ఇది అదునుగా భావించిన కొంతమంది చేతివాటం చూపిస్తున్నారు. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది రూ.200 టిక్కెట్లు ఇచ్చే కౌంటర్ల లో ఆన్‌లైన్‌లో నగదు చెల్లించగా వెంటనే టిక్కెట్టు ఇస్తారు. వెనువెంటనే మళ్లీ రీప్రింట్‌ టిక్కెట్టు తీసి వేరే భక్తుడికి విక్రయిస్తు ఫొన్‌ఫేలో డబ్బు లు జమ చేసుకుంటున్న వైనం ఒక భక్తుడి కూపిద్వారా వెలుగులోకి వచ్చింది. సదరు భక్తుడు సిబ్బంది చేస్తున్న మోసాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో డీసీ నల్లం సూర్యచక్రధరరావు విచారణ నిర్వహించారు. సదరు ఔట్‌సోర్సి ంగ్‌ సిబ్బంది సుమారు రూ.60వేల వరకూ తన వ్యక్తిగత బ్యాంక్‌ ఖాతా లో జమచేసుకున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా సదరు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ఆర్‌.రుషేంద్రపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అడ్డూ అదుపులేకుండా...

అయితే ఈ టికెట్ల మాయజాలంలో మరికొంతమంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఉన్నారని, వారిపేర్లు గోప్యంగా ఉంచి కేసు నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అలాగే గతంలో కొంతమంది సిబ్బంది భక్తుల నుంచి ప్యాకేజీలు మాట్లాడుకుని టిక్కెట్లు లేకుండా స్వా మివారి దర్శనం చేయించి సొమ్ములు చేసుకుంటున్న విషయం తెలిసినప్పటికి వారిని దూరంగా పెట్టి విధుల్లో ఉంచారు. అలాగే టిక్కెట్లను రీసైకిలింగ్‌ చేస్తూ పట్టుబడిన మరోవ్యక్తిని మందలించి వదిలేశారు. వారంతా నేతల అనుచరులే కావడంతో అడ్డూ అదుపులేకుండా పోతుంది. రెగ్యులర్‌ సిబ్బంది కార్యాలయ విభాగాల్లో నిర్వహణలో నిమగ్నమై ఉంటున్నారు. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఆక్రమాలకు పాల్పడుతున్నా వారిపై తీసుకుంటున్న చర్యలు శూన్యమే. నూతనంగా నియమితులైన ధర్మకర్తల మండలి పర్యవేక్షించి ఆరోపణలకు తావులేకుండా భక్తులకు మెరుగైన సేవలందించాలి.

Updated Date - Jan 18 , 2026 | 12:30 AM