ఏవీనగరంలో కల్యాణ వేంకటేశ్వరుని ఆలయాన్ని దత్తత తీసుకున్న టీటీడీ
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:50 AM
తొండంగి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీనగరంలో శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరుని ఆల యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం దత్తత తీసుకుంటూ గురువారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ ఆలయాన్ని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు
తొండంగి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీనగరంలో శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరుని ఆల యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం దత్తత తీసుకుంటూ గురువారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ ఆలయాన్ని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సొంత నిధులు వెచ్చించి నిర్మించారు. ఆగమ శాస్త్రం ప్రకారం నిత్యపూజలు, ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ప్రతీ శనివారం, విశేష దినాల్లోను అన్న ప్రసాదం అందిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో కల్యాణ మండపం నిర్మించి పేదల వివాహాలకు ఉచిత ంగా అందిస్తున్నారు. ఇతర దేవతా మూర్తులను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ ఆలయ నిర్వహణ మొత్తం యనమల కుటుంబం ఆధ్వ ర్యంలోనే జరుగుతుంది. ప్రభుత్వం రెవెన్యూ శాఖ నుంచి ఈ ఆలయాన్ని దత్తత తీసుకుంటూ జీవో నెంబర్ జారీ చేసింది. దీంతో ఇకపై ఇక్కడ జరిగే అన్ని కార్యక్రమాలు టీటీ డీ ఆధ్వర్యంలో జరగనున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఏవీ నగరం కల్యాణ వేంకటేశ్వరుని కైంకర్యాలు జరగనుండడం భాగ్యంగా గ్రామస్తులు భావిస్తున్నారు.