Share News

సెంటిమెంట్‌ పక్కనపెట్టి!

ABN , Publish Date - Jan 19 , 2026 | 12:58 AM

తిరుగు ప్రయాణాలు రష్‌ ఆదివారం అమావాస్య రోజు కూడా ఏమాత్రం తగ్గలేదు. సెంటిమెంట్‌ను పక్కనబెట్టి ఉమ్మడి జిల్లా ప్రజలు చాలా మంది తిరుగు ప్రయాణమయ్యారు.

సెంటిమెంట్‌ పక్కనపెట్టి!
కిక్కిరిసిన రాజమండ్రి రైల్వే స్టేషన్‌

బస్టాండ్లు కిటకిట

కిక్కిరిసిన రైల్వేస్టేషన్లు

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ దోపిడీ

రద్దీగా రహదారులు

ఆర్‌టీసీ సర్వీసులు పెంపు

రాజమహేంద్రవరం/ అమలాపురం రూరల్‌/ సామర్లకోట/పిఠాపురం, జనవరి 18 (ఆం ధ్రజ్యోతి) : తిరుగు ప్రయాణాలు రష్‌ ఆదివారం అమావాస్య రోజు కూడా ఏమాత్రం తగ్గలేదు. సెంటిమెంట్‌ను పక్కనబెట్టి ఉమ్మడి జిల్లా ప్రజలు చాలా మంది తిరుగు ప్రయాణమయ్యారు.బస్‌లు,రైళ్లు, విమానాలు కిటకిట లాడాయి. ద్విచక్ర వాహనాలు తిరుగుముఖం పట్టాయి. దీంతో ఎక్కడికక్కడ రహ దారులు రద్దీగా మారాయి. ఇక విజయవాడ, విశాఖప ట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ బస్సుల్లో నిలబడే ప్రయాణాలు సాగించాల్సిన పరిస్థితి. ఒకవైపు స్త్రీ శక్తి పథకంతో బస్సులు సరిపడక, మరోవైపు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారి తిరుగు ప్ర యాణాలతో ఆర్టీసీ బస్టాండ్లు ఉదయం నుంచి రాత్రి వరకు కిటకిటలాడి పోయాయి.

పల్లెలకు బై..బై

సోమవారం నుంచి స్కూల్స్‌ తెరుచు కోనుండడంతో తిరుగుప్రయాణమ య్యారు. దీంతో రైళ్లు, ఆర్టీసీ బస్‌లు, ప్రైవేట్‌ బస్‌లు నిండుగా మారాయి. పిల్లాపాపలతో ప్రయాణం చేయాల్సి ఉండడంతో రిజర్వేషన్లకు పాట్లు పడినా ఆదివారం రాత్రి వరకూ లభించలేదు. దీంతో గంటల తరబడి ఎదురుచూడా ల్సిన పరిస్థితి ఏర్పడింది. అందరూ ఒక్కసారే పల్లెల నుంచి పట్టణాలకు పయనం కావడంతో సామర్లకోట ఏడీబీ రోడ్డుతో సహా ప్రధాన రహదారులన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. గ్రామా లు బోసిపోయాయి. రైళ్లలో ప్రయాణిం చేందుకు రిజర్వేషన్‌ లేక ఆర్టీసీ బస్సు ల్లో ప్రయాణించేందుకు రిజర్వేషన్లు లభించక తిరిగి పట్టణాలకు వెళ్లేందుకు ప్రయాణీకులు నానా అవస్థలు పడుతు న్నారు. దీంతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు భారీ గా ఖర్చు చేయాల్సి వస్తోందని వాపో తున్నారు. కొంతమంది ప్రైవేట్‌ కార్లు మాట్లాడుకుంటున్నారు. దీంతో వారు సైతం భారీగా కిరాయిలు పెంచేశారు. ఒక కుటుంబం సామర్లకోట, కాకినాడల నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ డిమా ండ్‌ చేస్తున్నారు. ఆదివారం రాత్రి పిఠాపురం రైల్వేస్టేషన్‌ రద్దీగా మారింది. ప్రైవేటు బస్సుల్లో సీట్లు నిండిపోవడం తో అదనపు బస్సులు వేశారు.హైదరాబాద్‌కు టిక్కెట్‌ రూ.3 వేలు ఉన్నా వీటిని బుక్‌ చేసుకుని మరీ వెళ్లారు.

17 ప్రైవేట్‌ బస్‌లపై కేసులు

రావులపాలెం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల నుంచి అఽధిక టిక్కెట్టు ధరలు వసూళ్లు చేస్తున్న 17 ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులపై కేసులు నమోదు చేసినట్టు జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈత కోట హైవేలో ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులను రవాణాశాఖాధికారులు తనిఖీలు చేశారు. 17 ట్రావెల్‌ బస్సులపై కేసులు నమోదు చేసి రూ.1,17,600 జరిమానాలు విధించారు. టిక్కె ట్టు అధిక ధరలపై ప్రయాణికులు 10 కేసులు పెట్టారని తెలిపారు. తనిఖీల్లో ఎంవీఐలు రాజేంద్రప్రసాద్‌, శ్రీనివాస్‌, రవికుమార్‌,సురేష్‌కుమార్‌, షణ్ముఖశ్రీనివాస్‌, పాల్గొన్నారు.

క్షేమంగా ఇంటికి చేరండి : ఎస్పీ నరసింహ కిశోర్‌

రాజమహేంద్రవరంసిటీ :సంక్రాంతి పండుగకు వచ్చి తిరుగు ప్రయాణం అయ్యే వారు తగిన జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా ఇళ్ళకు చేరుకోవాలి. రోడ్డు మార్గాల్లో వెళ్లే వారు భద్రత నియమాలను పాటించాలి. బైక్‌లు, స్కూటీలు నడిపే వారు హెల్మెట్లు ధరించాలి. కారులో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్‌ తప్పనిసరిగా పెట్టుకోవాలి. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ మద్యం తాగుతూ వాహనాలు నడపరాదు. బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించే వారు అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రయాణ మార్గాల్లో ఇబ్బంది కలిగితే డయల్‌ 112,హెల్ప్‌లైన్‌ 1033కి సమాచారం ఇవ్వండి.

Updated Date - Jan 19 , 2026 | 12:58 AM