Share News

రాజమండ్రిలో పులి సంచారం.. జాగ్రత్తగా ఉండాలంటూ అధికారుల హెచ్చరికలు..

ABN , Publish Date - Feb 02 , 2026 | 01:15 AM

మూడు రోజుల కిందట రాజమండ్రి పరిధి సీతానగరం మండల పరిసరాల్లోకి పెద్ద పులి ప్రవేశించింది. ఆదివారం నాటికి తొర్రేడు చేరుకుని మూడు పశువులను చంపేసింది. అధికారుల సమాచారం మేరకు..

రాజమండ్రిలో పులి సంచారం.. జాగ్రత్తగా ఉండాలంటూ అధికారుల హెచ్చరికలు..

  • తొర్రేడులో భయం.. భయం

  • రాజమండ్రికి 6 కి.మీ దూరంలో మూడు ఆవులను చంపేసి, దూడను ఎత్తుకుపోయి పులి..

  • ట్రాప్‌ కెమెరాల ఏర్పాటు చేసిన అధికారులు

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యో తి) : అడవులను వదిలి పులులు జనారణ్యం లోకి వచ్చేస్తున్నాయి.. గతేడాది దివాన్‌చెరువు వద్ద చిరుతపులి సంచారంతో ఆరంభమైన భయం నుంచి నేటికీ తేరుకోలేదు. నాటి నుంచి పులులు బయటకు వస్తూనే ఉన్నాయి. అయినా అటవీ అధికారుల చర్యలు మాత్రం శూన్యం.. పులులు అడవులను వదిలి జనా రణ్యంలోకి వస్తున్నాయి..తర్వాత అవి ఏమ య్యాయనేది ఎవరికీ పట్టడంలేదు. దివాన్‌ చెరువులో సంచరించిన చిరుతపులి తర్వాత కడియం నర్సరీల్లో ప్రత్యక్షమైంది. అక్కడ నుంచి మాయమైంది. ఏమైందంటే అడవికి వెళ్లిపోయిందని అధికారులు వదిలేశారు. ఆ తరువాత తునిలో పులి ప్రత్యక్షమైంది. అదీ అంతే అలా వచ్చి మాయ మైంది. ఇటీవల నల్లజర్ల, గోపాలపురం మండలం భీమోలులో పులి అడుగుజాడలు కనిపించాయి. ఆ తర్వాత అదీ మాయమైంది. మళ్లీ శనివారం నుంచి మరో పులి బయటకు వచ్చింది. ముందుగా ఏలూరు జిల్లా పోలవరంలో ప్రత్యక్షమైంది. తూర్పుగోదావరి జిల్లా సీతాన గరంలోనూ పులి అడుగుజాడలు కనిపించాయి. తీరా ఆది వారం తెల్లారి చూస్తే రాజమహేంద్ర వరానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న తొర్రే డులో పులి ప్రత్యక్షమైంది. గామన్‌ బ్రిడ్జికి కొంత దూ రంలో ఉన్న తొర్రేడు గ్రామంలో ఆదివా రం మూడు ఆవులను చంపేసినట్టు అధికారులు గుర్తించారు.మెడను కొరికి,రక్తం తాగే సింది. ఒక దూడను అరటి తోటలోకి ఎత్తుకెళ్లి, తినే సింది. దీంతో తొర్రేడు, పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు.


గోదారి దాటి వచ్చిందా?

మూడు రోజుల కిందట సీతానగరం మండలంలో ప్రవేశించిన పెద్దపులి ఆదివారం నాటికి తొర్రేడు చేరుకుని మూడు పశువులను చంపేసింది. అధి కా రుల కథనం ప్రకారం ఇది మగ పులి. సుమారు మూడు నుంచి నాలుగేళ్ల వయసు..బరువు 200 కేజీలపైన ఉండొచ్చని..2 మీటర్ల పొడవు ఉందని అధికారులు చెబుతున్నారు. కొద్ది రోజుల కిందట దెందులూరు,జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో సంచ రించిన పులి ఇదేనని అంటున్నారు. జంగారెడ్డిగూ డెం ప్రాంతం నుంచి పాపికొండల మీదుగా గోదా వరి దాటి పోలవరం ప్రాజెక్టు మీదుగా సీతానగరం మండలంలోకి ప్రవేశించి ఉం డొచ్చని సమాచారం. ఇది సాధారణంగా నాలుగు కాళ్ల జంతువులనే వేటా డుతుంది.ప్రస్తుతం మగపులి ఒంటరిగానే వచ్చిందని అధికారులు చెబుతున్నా రు.పిల్ల ఉందనే ప్రచారం నిజం కాదని చెప్పారు.తొర్రేడులో ఉన్న పులి కదలి కలను పాపికొండల జూపార్కు వైల్డ్‌ రెస్క్యూ టీమ్‌ ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నారు.నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. దాని కదలికను గమనిస్తున్నారు.


నేడు బడులకు సెలవు

రైతులు, ప్రజలు రాత్రివేళ పొలాలకు వెళ్ల వద్దని డీఎఫ్‌వో ప్రభాకరరావు తెలి పారు. రాజమహేంద్రవరం రూరల్‌, సీతా నగరం, కోరుకొండ మండలాల పరిధిలోని పాఠ శాలలకు సోమవారం సెలవు ప్రకటిం చారు. ప్రభుత్వ, ప్రైవే ట్‌ పాఠశాలలన్నీ మూసివేయాలని డీఈవో కె.వాసుదేవరావు తెలిపారు. ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ యథావిధిగా జరుగుతాయన్నారు.అటవీ, రెవెన్యూ, పోలీ స్‌ శాఖల అధికారులు సమన్వయం తో వ్యవహరించాలన్నారు..పశువుల పాకల వద్ద రాత్రి వేళల్లో లైట్లు ఏర్పాటు చేయా లని, ఒంటిరిగా బయటకు రావొద్దని.. గుం పులుగా సంచరించాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ మేఘా స్వరూప్‌ ఆదేశించారు.


అదిగో పులి..

సీతానగరం, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి) : సీతానగరం మండలంలో పెద్దపులి తిరుగుతుందని.. తొర్రేడు నుంచి రాపాక చేరుకుందని వాట్సాప్‌ గ్రూపుల్లో పులి సంచరిస్తున్న ఫొటోలు హల్‌చల్‌ చేస్తుడడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చినకొండేపూడి-పెదకొండేపూడి మధ్య పంటపొలాల్లో శనివారం పులి అడు గులు కనిపించాయి. ఆ తరువాత పులి ఏమైందనేది తెలి యదు.అయితే సోషల్‌ మీడి యాలో మాత్రం రకరకాల ఊహాగానలు చక్క ర్లు కొడుతున్నా యి.ఈ విషయమై ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ దావీద్‌ రాజును వివరణ కోరగా అవి ఫేక్‌ ఫొటోలని చెప్పారు. ప్రతిచోట కెమె రాలు ఏర్పాటు చేయడం జరిగిందని.. త్వరలోనే పట్టుకుంటామన్నారు.

Updated Date - Feb 02 , 2026 | 08:06 AM