ముందుకెళ్ల్లి...వెనక్కి మళ్లీ...
ABN , Publish Date - Mar 18 , 2026 | 01:32 AM
ప్రత్తిపాడు, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో కొన్నిరోజులుగా సంచరిస్తున్న పెద్దపులి ముందుకు వెళ్తూ... వెనక్కిమళ్ళుతూ అటవీ అధికారులకు చిక్కడం లేదు. సబ్‌ప్లాన్ ఏజెన్సీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి వారం రోజులుగా అధికారులను ముప్పుతిప్పలు పెడుతుంది. హనుమాన్ బృందాలు, రెస్క్యూటీంలు పెద్దపులి
బవురువాక రిజర్వ్ ఫారెస్ట్‌లో పెద్దపులి
కొనసాగుతున్న రెస్క్యూ
హనుమాన్ బృందాల గాలింపు
బిక్కుబిక్కుమంటున్న బవురువాక, తాడువాయి, దోపర్తి గ్రామాల ప్రజలు
ప్రత్తిపాడు, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో కొన్నిరోజులుగా సంచరిస్తున్న పెద్దపులి ముందుకు వెళ్తూ... వెనక్కిమళ్ళుతూ అటవీ అధికారులకు చిక్కడం లేదు. సబ్‌ప్లాన్ ఏజెన్సీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి వారం రోజులుగా అధికారులను ముప్పుతిప్పలు పెడుతుంది. హనుమాన్ బృందాలు, రెస్క్యూటీంలు పెద్దపులి కోసం జల్లెడ పడుతున్నా తప్పించుకుని తిరుగుతుంది. అటవీశాఖాధికారులకు సవాలుగా మారిన పెద్దపులి మంగళవారం ప్రత్తిపాడు మం డలం బవురువాక రిజర్వ్‌ఫారెస్ట్‌లో చిటికెల కొం డపై మకాం వేసింది. పోలవరం జిల్లాలోని పాపికొండల అటవీ ప్రాంతంలో పాటు రంపచోడవ రం, రాజవొమ్మంగి పరిసర అటవీ ప్రాంతంలో 11 రోజులు సంచరించిన ఈ పెద్ద పులి మార్చి 13న ప్రత్తిపాడు మండలం ధారపల్లి జలపాతానికి చేరుకుంది. వారంరోజులు పాటు ప్రత్తిపాడు, శంఖవరం మండలాల్లోని సబ్‌ప్లాన్ ఏజెన్సీ ప్రాం తంలో పలు చోట్ల పశువులను మట్టు పెట్టింది. 12న బవురువాక రిజర్వ్‌ఫారెస్ట్‌లో కలియ తిరిగిన ఈ పెద్దపులి 5రోజుల పాటు సబ్‌ప్లాన్ ఏజెన్సీ గ్రామాలను చుట్టుముట్టింది. శంఖవరంతో పా టు అన్నవరం సమీపంలోని పంపా రిజర్వాయర్ మండపం, తదితర మైదాన గ్రామాల్లో సంచరించి తిరిగి వెనక్కి మళ్ళి బవురువాక రిజర్వ్ ఫారెస్ట్‌కు చేరుకుని చిటికెల కొండపై మకాం వేసింది దీంతో పెద్దపులిని బంధించేందుకు అటవీశాఖ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. కొండ సమీపంలో బ వురువాక, తాడువాయి ప్రధాన రహదారి వెంబ డి రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. 11హనుమాన్ ప్రత్యేక బృందాలు, 3 ట్రా క్విలైజింగ్ బృందాలు పనిలో తలమునకలయ్యా యి. పులి చిటికెల కొండ దిగిన వెంటనే సురక్షిత ంగా పట్టుకునేందుకు సాంకేతిక పర్యవేక్షణతో రె స్క్యూ, హనుమాన్ బృందాలు నిమగ్నమయ్యా యి. రాష్ట్ర అటవీ శాఖ సలహాదారుడు డి.మల్లికార్జునరావు, జిల్లా అటవీశాఖాధికారి రామచంద్రరావు, ఏలేశ్వరం ఫారెస్ట్ రేంజర్ దుర్గారాంప్రసాద్, అటవీశాఖాధికారి ఎస్‌ఎస్‌ఆర్ వరప్రసాదరావు ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. బవురువాక కొండ దిగువున రెస్క్యూ బృందాలతో అట వీశాఖాధికారులు సమాలోచనలు జరిపి పులిని బంధించే అంశంపై దిశానిర్దేశం చేశారు. బవురువాక రిజర్వ్‌ఫారెస్ట్ ప్రాంతం పెద్దపులి సంచారంతో బిక్కుబిక్కుమంటుంది. ఈ రిజర్వ్‌ఫారెస్ట్‌లోని తాడువాయి, దోపర్తి, బవురువాక, ఒమ్మం గి, కొత్తూరు, మాసపల్లి తదితర గ్రామాల ప్రజలను అటవీశాఖాధికారులు అప్రమత్తం చేశారు.
250 కిలోమీటర్లు ప్రయాణం
ఇదిలా ఉంటే ఉమ్మడి తూ ర్పుగోదావరి జిల్లాలో 18 రోజులు సంచరించిన పెద్దపులి ప్రత్తిపాడు నియోజకవర్గంలోని సబ్‌ప్లాన్ ఏజెన్సీలో మంగళవారంతో 7రోజులు కలియతిరిగినట్లు అయింది. ఇప్పటివరకు 250 కిలోమీటర్లు ప్ర యాణించిన ఈ పెద్ద పులి 15 పశువులపై దాడి చే సింది.