పెద్దపులి దాడిలో ఆవుదూడ మృతి
ABN , Publish Date - Mar 11 , 2026 | 01:45 AM
రాజవొమ్మంగి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలంలో పెద్దపులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం తెల్లవారుజామున మారేడుబాక పంచాయతీ జి.శరభవరం గ్రామ శివారులో ఆవుదూడపై పులి దాడి చేసింది. మెడ భాగంలో గాయపరచడంతో ఆవుదూడ
రాజవొమ్మంగి మండలం జి.శరభవరంలో సంచారం
అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు
రాజవొమ్మంగి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలంలో పెద్దపులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం తెల్లవారుజామున మారేడుబాక పంచాయతీ జి.శరభవరం గ్రామ శివారులో ఆవుదూడపై పులి దాడి చేసింది. మెడ భాగంలో గాయపరచడంతో ఆవుదూడ మృతి చెందింది. అయితే పశువులు అన్ని పరుగులు తీయడంతో పులి కూడా అక్కడ నుంచి వెళ్లిపోయినట్టు గ్రామస్తులు తెలిపారు. మంగళవారం సబ్ డీఎఫ్‌వో సుబ్బారెడ్డి, రాజవొమ్మంగి అటవీరేంజ్ అధికారి ణి ఉషారాణి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. నా గార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ రెస్క్యూ టీం సభ్యులు పులి దాడిలో ఆవుదూడ మృతి చెందినట్టు నిర్ధారించారు. గ్రామప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.