సీతానగరంలో పెద్దపులి కలకలం
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:59 AM
సీతానగరం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సీతానగరం మండలంలోని చినకొండేపూడి, పెదకొండేపూడి చీపురుపల్లి పంటభూముల్లో పెద్ద పులి సంచరిస్తోందని ఫారెస్ట్ అధికారులకు
వేలిముద్రల గుర్తింపు
నిర్ధారించిన ఫారెస్ట్ అధికారులు
సీతానగరం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సీతానగరం మండలంలోని చినకొండేపూడి, పెదకొండేపూడి చీపురుపల్లి పంటభూముల్లో పెద్ద పులి సంచరిస్తోందని ఫారెస్ట్ అధికారులకు రైతులు సమాచారం అందించారు. పాదముద్రలు ఉన్నాయన్న సమాచారంతో అక్కడకు వెళ్లి పరిశీలించి అవి పెద్ద పులి పాదముద్రలుగా నిర్ధారించారు. చినకొండేపూడి-పెదకొండేపూడి మార్గంలోని గెడ్డం రామకృష్ణ పంట పొలంలో పెద్దపులి పాదముద్రలు స్థానిక రైతులు గుర్తించారు. అయితే ఈ ప్రాంతంలో పెద్దపులులు లేవని, అడవి పం దుల పాదముద్రలు అయి ఉండవచ్చని భావించారు. అయితే ఏలూరు జిల్లాలో తిరుగుతున్న పులి ఇక్కడకు వచ్చి ఉండవచ్చని భావించిన రైతులు అటవీ శాఖాధికారులకు సమాచారం ఇ వ్వడంతో రాజమహేంద్రవరం అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ దావీద్‌రాజు అల్లూరి సీతారామరాజు జిల్లా, రేంజ్ ఆఫీసర్ కొండలరావు సిబ్బందితో పాదముద్రలు ఉన్న పంట భూమికి చేరుకుని పరిశీలించి పులి పాద ముద్రలుగా గుర్తించి ధృవీకరించారు. తహశీల్దార్ ఎ.శ్రీనివాస్, ఎస్‌ఐ డి.రామ్‌కుమార్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని అటవీ శాఖాధికారులతో చర్చించారు.
ఫారెస్ట్ వైపు కదలికలు..
పులి అడుగు జా డల ప్రకారం ఫారెస్ట్ వైపు కదలికలు ఉన్నాయని, చినకొండేపూడి శివారున పంటపొలాల్లో పులి పాదముద్రలుగా గుర్తించామని రేంజ్ ఆఫీసర్ దావీద్ రాజు తెలిపారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఏలూరు జిల్లా పోలవరం దగ్గరలో ఇటు కకోటలో శుక్రవారం రాత్రి రెండు దూడలపై దాడి చేసి హతమార్చిందన్నారు. అక్కడ నుంచి పట్టిసీమ ఎత్తిపోతల పథకం వైపు వచ్చిందని, కాలువ వద్ద రాళ్లు ఉండ డంతో పాద ముద్రలు పడలేదన్నారు. గో దావరి దాటి చినకొండేపూడి వైపు వ చ్చిందన్నారు. పశువులను సాధ్యమైనంతవరకు గ్రా మాల్లో కట్టుకోవాలని, లైట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాత్రి సమయాల్లో బయటకు వెళ్లవద్దని, వెళ్లవసలి వస్తే గుంపులుగా వెళ్లాలని సూచించారు. పులి జాతీయ జంతువని, కనిపిస్తే దాడులు చేసి హతమార్చవద్దని ఆయన కోరారు.