ప్రపంచ తెలుగు మహాసభల్లో డాక్టర్ కొల్లూరికి సత్కారం
ABN , Publish Date - Jan 07 , 2026 | 01:30 AM
ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో గుంటూరులో జరిగిన మూడో ప్రపంచ తెలుగు మహాసభ
అమలాపురంటౌన్,జనవరి 6(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో గుంటూరులో జరిగిన మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో కవి సమ్మేళనం వేదికకు మూడు రోజులపాటు సమన్వయకర్తగా వ్యవహరించిన కవి డాక్టర్ ఎస్‌ఆర్‌ఎస్ కొల్లూరిని ముఖ్యఅతిథులుగా హాజరైన శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహనరావు ఘనంగా సత్కరించి తెలుగుతల్లి జ్ఞాపికను అందజేశారు.