ఎస్.యానాం బీచ్‌లో 14, 15, 16 తేదీల్లో సంక్రాంతి సంబరాలు
ABN , Publish Date - Jan 04 , 2026 | 01:22 AM
ఆంధ్రా గోవా ఎస్.యానాం కోకో బీచ్‌లో ఈనెల 14 నుంచి మూడ్రోజులపాటు సంక్రాంతి సంబరాలను కన్నుల పండుగగా నిర్వహించడానికి నిర్ణయించినట్టు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు వెల్లడించారు. అమలాపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీ హరీష్‌మాధుర్, కూటమి నేతలతో కలసి సంక్రాంతి సంబరాలకు సంబంధించి పోస్టరను ఆవిష్కరించారు.
రాష్ట్ర పండుగగా సంబరాల నిర్వహణకు ప్రభుత్వ నిర్ణయం
బ్రోచర్ ఆవిష్కరించిన ఎంపీ హరీష్, ఎమ్మెల్యే ఆనందరావు
అమలాపురం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా గోవా ఎస్.యానాం కోకో బీచ్‌లో ఈనెల 14 నుంచి మూడ్రోజులపాటు సంక్రాంతి సంబరాలను కన్నుల పండుగగా నిర్వహించడానికి నిర్ణయించినట్టు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు వెల్లడించారు. అమలాపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీ హరీష్‌మాధుర్, కూటమి నేతలతో కలసి సంక్రాంతి సంబరాలకు సంబంధించి పోస్టరను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ కార్యదర్శి మెట్ల రమణబాబు, డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, టీడీపీ రాష్ట్ర మహిళా నేత పెచ్చెట్టి విజయలక్ష్మి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనందరావు మాట్లాడుతూ బీచ్‌లో నాలుగువేలమంది ఆశీనులయ్యేలా భారీ షెడ్డు నిర్మాణంతోపాటు 200 మంది విందు ఆరగించేలా రెస్టారెంట్‌ను నిర్మించడం జరుగుతోందన్నారు. ఎస్.యానాం బీచ్‌లో జరిగే సంక్రాంతి సంబరాలను రాష్ట్ర పండుగగా నిర్వహించడానికి నిర్ణయించిన సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తోపాటు ఇతర కూటమి నేతలకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంక్రాంతి బీచ్ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు వీలుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. పండుగ మూడ్రోజులూ తిరునాళ్లను తలపించే రీతిన ఇక్కడ వాటర్ స్పోర్స్, పారాచ్యూట్స్ వంటివి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అమలాపురం ఎంపీ హరీష్‌మాట్లాడుతూ బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు ఎమ్మెల్యే ఆనందరావు చొరవ చూపడం అభినందనీయమని, వీటికి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నోటిఫై చేయడం పట్ల సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ అధికారి జయవెంకటలక్ష్మి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, బీజేపీ నేత నల్లా పవన్‌కుమార్, మోకా సుబ్బారావు, జనసేన నాయకుడు ఆర్డీ ఎస్ ప్రసాద్, మున్సిపల్ ప్రతిపక్ష నేత యేడిద శ్రీను తదితరులు పాల్గొన్నారు.