Share News

సుప్రీం ఆదేశాలతో మధ్యవర్తిత్వ శిక్షణా తరగతులు

ABN , Publish Date - Jan 20 , 2026 | 01:04 AM

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మధ్యవ ర్తిత్వ విధానాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడంలో భాగంగా 40గంటలపాటు మధ్యవర్తిత్వ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్న ట్టు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. సో మవారం జిల్లా కోర్టు ఆవరణలో సుప్రీం కోర్టు మధ్యవర్తిత్వం, రాజీ ప్రాజెక్టు కమిటీ(ఎంసీపీ సీ) అధ్వర్యంలో నిర్వహించే శిక్షణా తరగతుల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.

సుప్రీం ఆదేశాలతో మధ్యవర్తిత్వ శిక్షణా తరగతులు
కార్యక్రమంలో మాట్లాడుతున్న పీడీజే గంధం సునీత

  • పీడీజే గంధం సునీత

రాజమహేంద్రవరం, జనవరి 19(ఆంధ్రజ్యో తి): సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మధ్యవ ర్తిత్వ విధానాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడంలో భాగంగా 40గంటలపాటు మధ్యవర్తిత్వ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్న ట్టు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. సో మవారం జిల్లా కోర్టు ఆవరణలో సుప్రీం కోర్టు మధ్యవర్తిత్వం, రాజీ ప్రాజెక్టు కమిటీ(ఎంసీపీ సీ) అధ్వర్యంలో నిర్వహించే శిక్షణా తరగతుల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌-89 ప్రకారం వివాదాలను నాలుగు ప్రత్యామ్నా య పద్ధతుల ద్వారా పరిష్కరించే అవకాశం ఉందని, వాటిలో మధ్యవ ర్తిత్వం ఒక ముఖ్యమైన విధానమ న్నారు. ఏదైనా కేసు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమవుతుందని న్యా యాధికారులు నిర్ధారణకు వచ్చిన ప్పుడు సదరు కేసులను మధ్యవర్తి త్వ కేంద్రానికి సిఫారసు చేస్తారన్నారు. లోక్‌ అదాలత్‌ల ద్వారా సివిల్‌, కాంపౌండబుల్‌ క్రిమి నల్‌, భూసేకరణ, ఎగ్జిక్యూటివ్‌, మోటారు వా హన ప్రమాదాలకు సంబంధించిన ఎంవీవోపీ కేసులకు పరిష్కారం లభిస్తుందన్నారు.ఈ వి ధంగా పరిష్కారమైతే కోర్టు ఫీజు కూడా తిరిగి లభిస్తుందన్నారు.మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కా ర మైన కేసులపై అప్పీలు చేసుకొనే అవకాశం ఉండదన్నారు.కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ కార్య దర్శి ఎన్‌.శ్రీలక్ష్మీ, మీడియేషన్‌ మాస్టర్‌ ట్రైనర్లు ఎస్‌హెచ్‌ సురేందర్‌ సింగ్‌(ఢిల్లీ), పీఎం మొహ మ్మద్‌ సిరాజ్‌(కేరళ) తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 01:04 AM