Share News

ఎండకు ఎండి.. వానకు తడిసి..

ABN , Publish Date - Jan 04 , 2026 | 01:15 AM

నిత్యం భక్తులతో కిటకిటలాడే పోచమ్మ తల్లి ఆలయం ప్రస్తుతం వెలవెలబోతోంది. గతంలో ఆదివారం, మంగళవారం వచ్చిందంటే ఆలయం వద్ద భక్తుల తాడికి, చుట్టూ షాపులతో కళకళలాడేది. గోదావరి నీరు తరచూ ముంచెత్తుతుండడంతో ఆలయాన్ని పూర్తిగా మూసివేశారు. అమ్మవారి రాతి విగ్రహాన్ని సమీప కొండపై ఏర్పాటు చేశారు. కాని వర్షం పడకుండా పైన రేకు వెయ్యలేదు, దర్శనానికి వెళ్లడానికి కనీసం మెట్లు కూడా ఏర్పాటు చేయలేదు.

ఎండకు ఎండి.. వానకు తడిసి..
కొండ ఎక్కేందుకు కర్రలకు తాడు కట్టిన దృశ్యం

  • గండిలో పోచమ్మతల్లికి నీడ కరువు

  • కొండపై విగ్రహం ఏర్పాటు

  • పైకి వెళ్లేందుకు మెట్లు కూడా లేవు

  • కర్రలకు కట్టిన తాడే ఆధారం

  • దర్శనానికి భక్తుల ఇబ్బందులు

సీతానగరం, జనవరి 3(ఆంద్రజ్యోతి): నిత్యం భక్తులతో కిటకిటలాడే పోచమ్మ తల్లి ఆలయం ప్రస్తుతం వెలవెలబోతోంది. గతంలో ఆదివారం, మంగళవారం వచ్చిందంటే ఆలయం వద్ద భక్తుల తాడికి, చుట్టూ షాపులతో కళకళలాడేది. గోదావరి నీరు తరచూ ముంచెత్తుతుండడంతో ఆలయాన్ని పూర్తిగా మూసివేశారు. అమ్మవారి రాతి విగ్రహాన్ని సమీప కొండపై ఏర్పాటు చేశారు. కాని వర్షం పడకుండా పైన రేకు వెయ్యలేదు, దర్శనానికి వెళ్లడానికి కనీసం మెట్లు కూడా ఏర్పాటు చేయలేదు.ఇదిలా ఉంటే ఆలయానికి అతి సమీపంలో టూరిస్టు బోట్లు ఏర్పాటు చేయడంతో అఽధిక సంఖ్య లో టూరిస్టులు పాపికొండల విహా ర యాత్రకు వెళుతున్నారు. ఉద యం సాయంత్రం ఆ ప్రదేశం టూ రిస్టులతో నిండిపోతోంది. అక్కడికి వచ్చిన వారు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ నిర్వాహకులు కొండ నుంచి కర్రలు పాతి వైరు కట్టారు. ఆ వైరు పట్టకుని పైకి ఎక్కాలి. ప్రభుత్వానికి ఎంతో ఆదాయం తెచ్చిపెట్టిన ఈ ఆలయానికి ఆలనాపాలనా కరువయింది. అధికారులు స్పందించి. కొండపై ఏర్పాటుచేసిన ఆమ్మవారికి విగ్రహంపై రేకుల షెడ్‌ వేసి, భక్తులు దర్శనానికి వెళ్లేందుకు మెట్లు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Jan 04 , 2026 | 01:15 AM