Share News

అదే దంచుడు!

ABN , Publish Date - May 24 , 2026 | 12:17 AM

సూర్య ప్రతాపం ఏమాత్రం తగ్గలేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శనివారం కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ముందురోజుతో పోలిస్తే కొంత మెరుగు. శుక్రవారం రాత్రి నుంచి వివిధ ప్రాంతాల్లో ఈదురుగాలులు, చిరుజల్లులు పడ్డాయి. దీంతో ఉదయం పూట కాస్త చల్లగానే ఉన్నప్పటికీ మధ్యాహ్నం నాటికి ఎండ తీవ్రత పెరిగింది. సాయంత్రం కూడా వేడి తగ్గని పరిస్థితి ఉంది.

అదే దంచుడు!

సూర్య ప్రతాపం ఏమాత్రం తగ్గలేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శనివారం కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ముందురోజుతో పోలిస్తే కొంత మెరుగు. శుక్రవారం రాత్రి నుంచి వివిధ ప్రాంతాల్లో ఈదురుగాలులు, చిరుజల్లులు పడ్డాయి. దీంతో ఉదయం పూట కాస్త చల్లగానే ఉన్నప్పటికీ మధ్యాహ్నం నాటికి ఎండ తీవ్రత పెరిగింది. సాయంత్రం కూడా వేడి తగ్గని పరిస్థితి ఉంది.

(కాకినాడ/అమలాపురం/ రాజమహేంద్రవరం సిటీ - ఆంధ్రజ్యోతి)

ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. అయితే కాకినాడలో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు వడగాడ్పులతో వేడిగా ఉన్న వాతావర ణం రాత్రి పది గంటల వేళ చల్లగా మారింది. పెద్దఎత్తున ఈదురుగాలులు వీచాయి. వాతావరణం కాస్త మేఘావృతమై అక్కడక్కడా చిరుజల్లులు కురిశాయి. రాత్రి చల్లగా మారిన వాతావరణం శనివారం ఉదయం వరకు కొనసాగిం ది. అయితే సాయంత్రం మూడు గంటల నుం చి భానుడు తన ఉగ్రరూపాన్ని చూపాడు. కాకినాడ జిల్లాలో పెద్దాపురం, సామర్లకోట, గొల్లప్రో లు, పిఠాపురం, తొండంగి, కోటనందూరులో 41 డిగ్రీలు అత్యధికంగా నమోదయ్యాయి. తాళ్లరే వు, ఏలేశ్వరం, తునిలో 40 డిగ్రీలు, కాకినాడ రూరల్‌, పెదపూడి, కరప, యు.కొత్తపల్లి, కాజులరు, జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, శంఖవరం, కొత్తపల్లిలో 39 డిగ్రీలు, గండేపల్లిలో 38 డిగ్రీలు నమోదయ్యాయి. కాస్త తగ్గిన ఉష్ణోగ్రతలతో జనానికి కొంత ఉపశమనం లభించింది.

రాజమహేంద్రవరం.. సలసలా..

జిల్లా అంతటా ఎండలు దంచికొడుతున్నా యి. శనివారం ఉదయం కాస్త మబ్బు వాతావరణం ఉన్నా క్రమంగా ఎండముదిరి వడగాల్పు లు వీశాయి. అత్యధికంగా రాజమహేంద్రవరం నగరంలో 45.0 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే గోపాలపురం మండలంలో 44.3 డిగ్రీలు, నల్లజర్ల43.1, చాగల్లు 42.5, కొవ్వూరు 42.4, తాళ్లపూడి 41.8, రాజమహేంద్రవరం రూరల్‌ 41.5, దేవరపల్లి 41.1, రాజానగరం 41.2, కోరుకొండ 41.1 డిగ్రీలు, మండపేట 40.9, ఉండ్రాజవరం 40.7, గోకవరం 40.6, కడియం 40.4, బిక్కవోలు, 40.3, అనపర్తి 40.3, నిడదవోలు 40.3, రాయవరం 40.1, సీతానగరం 40.0, రంగంపేట 39.5, కపిలేశ్వరపురం 38.8, పెరవలి 38.5.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

కోనసీమలో చిరుజల్లులు..

డాక్టర్‌ బీఆర్‌అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి, శనివారం వేకువజామున గాలులతో కూడిన చిరుజల్లులు పలుచోట్లపడ్డాయి. దాం తో వాతావరణం చల్లబడినా, మధ్యాహ్నం నుంచి ఎండ దంచికొట్టింది. కె.గంగవరంలో 40.3 అత్య ధిక డిగ్రీల ఉష్ణోగత నమోదుకాగా, రామచంద్రపురంలో 40.1, అయినవిల్లి 38, ఆలమూరు 40.3, అల్లవరం 37, అమలాపురం 38, అంబాజీపేట 37.5, ఆత్రేయపురం 38.5, ఐ.పోలవరం 38, కాట్రేనికోన 38.4, కొత్తపేట 37.5, మలికిపురం 36.4, మామిడికుదురు 37, ముమ్మిడివరం39, పి.గన్నవరం 37.5, రావులపాలెం38.5, రాజోలు 37, సఖినేటిపల్లి 35.9, ఉప్పలగుప్తంలో 39 డిగ్రీలు నమోదయ్యాయి.

గిరగిరా తిరుగుతున్న విద్యుత్‌ మీటర్లు

(కాకినాడ - ఆంధ్రజ్యోతి)

సూర్యుడు సుర్రుమంటున్నాడు. బయటకు అడుగుపెడితేచాలు నడినెత్తిన నాట్యమాడుతున్నాడు. దీంతో చాలామంది నీడపట్టునే ఉండేం దుకు ప్రయత్నిస్తున్నారు. ఇళ్ల నుంచి బయట కు రావడానికి భయపడుతున్నారు. అధిక వేడి తో ఇంట్లో 24 గంటలూ ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటున్నాయి. ఇక ఏసీల వినియోగం భారీగా పెరిగింది. ఇటీవల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 40-46 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చిన్నారులు, వృద్ధులు చె మటలతో, గాలి ఆడక నరకం చూస్తున్నారు. పైన సీలింగ్‌ఫ్యాన్‌, కింద.. టేబుల్‌ ఫ్యాన్లు, ఏసీ లు, కూలర్లు, ఫ్రిజ్‌లు, ఇన్వర్టర్లు ఇలా ఇళ్లల్లో అన్నీ నిత్యం పనిచేస్తూనే ఉండాల్సి వస్తోంది. అధికంగా విద్యుత్‌ను ప్రతి ఒక్కరూ వాడుతుండడంతో విద్యుత్‌ మీటర్ల రీడింగ్‌ కూడా పెరిగింది. సాధారణ రోజుల్లో విద్యుత్‌ వినియోగం కంటే అధికంగా యూనిట్లు పెరిగాయి. మా మూలుగా ఉమ్మడి జిల్లాలో 16 నుంచి 18 మి లియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం ఉం టుంది. ఈ వేసవిలో 24 మిలియన్‌ యూనిట్ల వరకు వినియోగం పెరిగింది. కాకినాడ జిల్లా లో గృహావసర, వాణిజ్య, పరిశ్రమలు, వ్యవసా య అనుబంధ విద్యుత్‌ కనెక్షన్లకు సంబంధిం చి మొత్తం 8,00,126 మంది విద్యుత్‌ వినియోగదారులు ఉన్నారు. వీటిలో గృహావసర విద్యు త్‌ కనెక్షన్లు 6,75,349 ఉన్నాయి. తూర్పుగోదావ రి జిల్లాలో 7,96,970 మంది విద్యుత్‌ వినియోగదారుల్లో 6,52,029 గృహావసర విద్యుత్‌ కనెక్షన్‌దారులు ఉన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 6,54,785 మంది వినియోగదారులు కాగా, వీరిలో 5,49,870 గృహావసర విద్యుత్‌ కనెక్షన్‌దారులు ఉన్నారు. ప్రస్తుతం గృహావసర విద్యుత్‌ వినియోగదారుల వాడకం విపరీతంగా పెరిగింది. దీంతో కరెంటు బిల్లులు వినియోగదారుల కొంపముంచనున్నాయి.

అత్యధికం

తూర్పు : రాజమహేంద్రవరం నగరంలో.. 45 డిగ్రీలు

కాకినాడ : పెద్దాపురం సహా 6 మండలాల్లో.. 41 డిగ్రీలు

పోలవరం : కూనవరంలో.. 45 డిగ్రీలు

కోనసీమ : కె.గంగవరంలో.. 40.3 డిగ్రీలు

Updated Date - May 24 , 2026 | 12:17 AM